వరంగల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Friday, 17 September 2021

వరంగల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్


వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో మరో సారి ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మూడో సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బట్టలు విప్పించి ర్యాగింగ్ చేశారు. బాధితుడు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విద్యార్థి కావడం గమనార్హం. జాతీయ స్థాయి మెడికల్ సీట్ల కోటాలో బాధితుడికి కాకతీయ మెడికల్ కాలేజీలో సీటు లభించింది. ఈ విషయాన్ని బాధితుడు కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో ఘటన గురించి విద్యార్థి కుటుంబ సభ్యులు కాలేజీ అధికారులకు ఫిర్యాదు చేశారు.  డిఎంఈ రమేష్ రెడ్డి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి వచ్చి… ఈ ఘటనపై ఆరా తీసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ర్యాగింగ్ చేసిన విద్యార్థులతో… బాధితుడికి క్షమాపణలు చెప్పించారు అధికారులు. దీంతో ఆ వివాదం ముగిసిందని కాకతీయ మెడికల్ కాలేజ్ అధికారులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Post Top Ad