పంక్చరే కాని టైర్లు !

Telugu Lo Computer
0


వాహనాలకు చాలా ఎక్కువ వేగాన్ని అలాగే స్టెబిలిటీని అందించడంలో టైర్లు చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి.ఇక సరియైన క్వాంటిటీలో టైర్లలో గాలి ఉంటే వాహనం ఎక్కువ పికప్‌ను అందుకుని చాలా వేగంగా వెళ్లడం జరుగుతుంది. అలాగే కొన్ని హైక్వాలిటీ టైర్లు కూడా ఎక్కువగా పంక్చర్‌ అవ్వడం కూడా మనం చూస్తున్నాము. ఆ టైర్ల స్థానంలో ట్యూబ్‌లెస్‌ టైర్లు మార్కెట్లలోకి వచ్చాయి. ట్యూబ్‌లెస్‌ టైర్లు కనుక పంక్చర్‌ అయితే కొంత దూరం మేర వచ్చినా కాని .. ఆ ఈ టైర్లు కచ్చితంగా పంక్చర్‌ ప్రూఫ్‌ మాత్రం అస్సలు కాదనే విషయం గుర్తు పెట్టుకోవాలి. అలాగే తిరిగి వాటికి పంక్చర్‌ చేయల్సిన పని కూడా ఉంటుంది. పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్ల కోసం చాలా కంపెనీలు చాలా సంవత్సరాలు నుంచి  పనిచేస్తున్నాయి. పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లను అందించడంలో మిచెలిన్‌ కంపెనీ ఇప్పుడు ముందుంది. తాజాగా మిచెలిన్‌ కంపెనీ పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లను టెస్ట్‌ చేయడం జరిగింది. 2005 వ సంవత్సరం నుంచి కూడా ఈ  టైర్ల కంపెనీ మిచెలిన్‌ పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లపై పరిశోధన చేస్తుంది.  పది సంవత్సరాల పాటు చేసిన పరిశోధనల ఫలితంగా మిచెలిన్‌ పంక్చర్‌ ఫ్రూఫ్‌ టైర్లను రియాల్టీలోకి తేవడం జరిగింది. ఫ్యూచర్ లో రానున్న ఎలక్ట్రిక్‌ వాహనాలకు కూడా పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. మిచెలిన్‌ కంపెనీ ఫ్యూచర్ లో పర్యావరణానికి అనుకూలంగా ఉండే గ్రీన్‌ టైర్లను అందుబాటులోకి తీసుకురాబోతుంది. యూనిక్‌ పంక్చర్‌ప్రూఫ్ టైర్ సిస్టమ్ ద్వారా ఎయిర్‌లెస్ టైర్  అలాగే పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లను అందించబోతుంది. 3 డీ ప్రింటింగ్‌తో తయారు చేసిన ఈ టైర్లను మిచెలిన్‌ కంపెనీ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)