రీఛార్జ్ చేస్తే జియోఫోన్ ఉచితం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Sunday, 19 September 2021

రీఛార్జ్ చేస్తే జియోఫోన్ ఉచితం

 

లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ తో జియోఫోన్ ను ఉచితంగా అందిస్తోంది. కొత్త ఫోన్ కోనాలనుకునే వారికి ఇది ధమాకా ఆఫర్. ఈ ఆఫర్ ద్వారా రెండు సంవత్సరాల రీఛార్జ్ ఒకేసారి చేస్తే జియో 4G ఫోన్ ఉచితంగా లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఇప్పటికే జియోఫోన్ ను వాడుతున్న కస్టమర్ల కోసం కూడా మంచి ప్లాన్ ని అందించింది. జియోఫోన్ 2021 ఆఫర్ తో జియోఫోన్ ను ఒకేసారి 24 నెలల అన్ లిమిటెడ్ సర్వీస్ తో సహా కేవలం 1,999 రూపాయలకు అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా, ఈ ఆఫర్ ఎంచుకునే కొత్త చందాదారులకు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి. అధనంగా, జియోఫోన్ ఉచితంగా లభిస్తుంది. అంతేకాకుండా  అన్ లిమిటెడ్ ప్రయోజనాలతో కేవలం ఒక్క సంవత్సరం వ్యాలిడిటీ మాత్రమే కోరుకుంటే, రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీని కోసం, చందాదారులు సింగిల్ పేమెంట్ క్రింద రూ .1,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో, ఉచిత జియోఫోన్ మరియు 12 నెలల అన్ లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. ఇందులో, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటా 12 నెలలకు ఉంటాయి. అదనంగా, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారుల కోసం కూడా ఒక ప్లాన్ ప్రకటించింది. దీనితో, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారులు సంవత్సరానికి 2GB రోజువారీ డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. ఇవన్నీ కూడా మరింత కేవలం 749 రూపాయల అఫర్ ధరకే పొందవచ్చు. అయితే, ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఇప్పటికే ఉన్న JioPhone నంబర్లలో మాత్రమే ఈ ప్లాన్ యాక్సెస్ చేయబడుతుంది.


No comments:

Post a Comment

Post Top Ad