మాఘ కవి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 12 September 2021

మాఘ కవి

 

మాఘ కవి తన చివరి రోజుల్లో  ఘూర్జర దేశం నుంచి ధారానగరం చేరాడు. తన తీవ్రమైన అస్వస్థత వల్ల భోజరాజు ఆస్థానానికి తాను పోలేక  తాళపత్రం మీద ఒక శ్లోకం వ్రాసి తనభార్య చేతికిచ్చి భోజరాజుకు యిచ్చి రమ్మని పంపించాడు. ఆమె భోజుడి సభకు వచ్చి ఆ తాళపత్రం రాజుకు సమర్పించి తన భర్త తీవ్రమైన అస్వస్థత వల్ల రాలేక యిది పంపించారని చెప్పింది. అప్పటికే మాఘ కవి కవిత్వాన్ని  అందరూ పోగుడుతూండే వారు. రాజు ఆ తాళపత్రం చదివి సభకు వినిపించాడు. అది అద్భుతమైన ప్రభాత వర్ణన. కుముద వన మపశ్రీ:, శ్రీమదంభోజ షండం

త్యజతి ముదములూకః,ప్రీతిమాన్ చక్రవకః !

ఉదయం-అహిమ రశ్మి: -- ,యాతి శీతాంశు రస్తం

హతవిధి లలితానాం, హా,  విచిత్రో విపాకః

తా:--ఒకపక్క తెల్ల కలువల గుంపు కళ తప్పి వుంది, మరో పక్క తామరపూల సమూహానికి శోభ హెచ్చింది,

గుడ్లగూబ జోరు కోల్పోతున్నది, చక్రవాక పక్షికి హుషారు పెరుగుతున్నది, వేడి కిరణాల సూర్యుడు ఒక పక్క వుదయిస్తూవుంటే, మరోపక్క చల్లని కిరణాల చంద్రుడు క్రుంకుతున్నాడు, ఈ పాడు విధిలీల లలితమైన ప్రభావం  వస్తువుల మీద ఎంత విచిత్రంగా వుంటుంది.ఒకరికి మాలినది యింకొకరికి చేటు అవుతున్నది.

ఈ అద్భుతమైన వర్ణన విని భోజరాజు ఆనందం తో పొంగిపోయాడు. మాఘపత్నికి మూడు లక్షలిచ్చి

అమ్మా! ఈ సొమ్ము ప్రస్తుతానికి మీ భోజనాదికాలకు మాత్రమే. రేపు ఉదయం నేను స్వయంగా వచ్చి మాఘ కవిని దర్శించుకొని సత్కరిస్తాను అన్నాడు.

ఆ సొమ్ము తెసుకొని ఆమె యింటికి బయల్దేరింది.దోవలో ఎందరో యాచకులు కనిపించారు.వారంతా మాఘకవి కావ్యాల గొప్పతనం గురించి పొగుడుతున్నారు.మాఘుడి భార్య రాజు తనకిచ్చిన సొమ్మంతా వాళ్లకు దానం చేసేసి వట్టి చేతులతో యిల్లుచేరింది.స్వామీ! మీ శ్లోకం చదివి సంతోషించి చాలా సొమ్ము బహూకరించాడు.కానీ అది నేను దోవలోనే యాచాకులకిచ్చి వేశాను.అని చెప్పింది అందుకు మాఘుడు మంచిపని చేశావు.కానీ ఒకటే చిక్కు యింకా యాచకులు వస్తూ వుంటారు కదా!వాళ్ళకేమి యిచ్చేది?అన్నాడు.అంతలోనే  ఒక యాచకుడు వచ్చిమాఘుడి దగ్గర కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలలేదని గ్రహించి యిలా శ్లోకం చెప్పాడు.

ఆశ్వాస్య పర్వత  కులం తపనోష్ణ తప్తం -

ఉద్ధామ దావ విధురాణి చ కాననాని

నానానదీ నద శతానిచ పూరయిత్వా

రిక్తోస్తి యత్, జలదః సైవ తవోత్తమశ్రీ:(సా-యేవ-తవ-వుత్తమశ్రీ:)

తా:-- ఓ! మేఘుడా! సూర్యుడి వేడికి మాడిపోయిన కొండల గుంపునూ,దావాగ్ని తో కాలి చెడిపోయిన  అడవులనూ చల్లబరిచి, ఓదార్చి,అనేక నదీ నదాలను నీటితో నింపి వేసి నువ్వు వట్టిపోతే మాత్రం ఏమయింది?అదే నీకు అసలైన ఘనత ఎంతటి పేదరికం లోవున్నా మాఘుడు వదాన్యుడు, సాహిత్యాభిమాని అంత  చక్కని  శ్లోకం  చెప్పిన కవిని సత్కరించాలని వుబలాటం వున్నా చేతిలో సొమ్ము లేదు.బాధపడుతూ యిలా అన్నాడు.

అర్థాః న సంతి, న ముంచతి మాం దురాశా!

త్యాగే రతిం మహతి దుర్లలితం మనః మే

యాచ్నా చ లాఘవకరీ, స్వవధే చ పాపం

ప్రాణాః స్వయం వ్రజత!కిం పరిదేవనేన

తా:-- చేతిలో ధనం లేదు కానీ నన్ను ఈ దురాశ వదలకున్నది.నా పాడు మనసుకు దానం మీదే ఆసక్తి.

యాచన చేసినా దానం చేద్దామనుకుంటే చులకన  అయిపోతాను.ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం కదా!

ఓ!ప్రాణము లారా!మీ అంతట మీరే నన్ను విడిచి వెళ్ళిపొండి విచారమెందుకు?ఈ స్థితిలో మాఘుడిని చూసి వచ్చిన యాచకులు వచ్చిన త్రోవనే వెళ్ళిపోయారు.మాఘుడికి చాలా దుఖం కలిగింది.

వ్రజత వ్రజత ప్రాణాః! అర్థిభి: వ్యర్థతాం గతాః

పశ్చాదపి చ గంతవ్యం ; కవ స్వార్థః పునరీ దృశః

తా:--ఓ ప్రాణము లారా!యాచకులకు పనికి రాకుండా పోయిన నన్ను విడిచి ఆ యాచాకుల్లాగే వెళ్ళిపొండి

తర్వాతయినా పోవాల్సిందే కదా?అని విలపిస్తూనే మాఘుడు ప్రాణాలు వదిలాడు.

భోజరాజుకు ఈ విషయం తెలిసి రాత్రికి రాత్రే నూర్గురు బ్రాహ్మణులతో సహా మాఘుడి వసతి గృహానికి వచ్చి

చూశాడు.మరుదినం ఉదయమే మాఘుడికీ ఆయనతో బాటు ప్రాణాలు వదిలిన ఆయన భార్యకూ స్వంత

కొడుకు లాగా అంత్యక్రియలు యధావిధిగా జరిపించాడు.ఇది భోజ ప్రబంధము లోని కథ.

"శిశుపాలవధ"మహా కావ్యాన్ని, భారవి వ్రాసిన "కిరాతార్జునీయం"ని మించిన కావ్యాన్ని వ్రాయాలనే పట్టుదలతో 20 సర్గల కావ్యాన్ని  వ్రాశాడు.మాఘుడు  "శిశుపాలవధ"కూడా పంచమహా కావ్యాలలో  ఒకటి.ఈ కావ్యం లో తొమ్మిది సర్గలు చదివితే,యిక ఆ పాఠకుడికి సంస్కృత భాషలో కొత్త పదం అంటూ కనపడదని నానుడి.

"నవ సర్గ గతే మాఘే నవశబ్దః  నవిద్యతే". ఆ కావ్యానికి వ్యాఖ్యానం వ్రాసిన మల్లినాథసూరి

"మాఘే,మేఘే గతం వయః " అన్నాడు.(నా జీవిత మంతా మాఘ కావ్యాన్నీ,మేఘదూతం కావ్యాన్నీ  అధ్యయనం చేయటంతోనే గడిచి పోయింది అని చెప్పుకున్నాడు).

No comments:

Post a Comment