ఐదు రోజుల పాటు సెలవులా...?

Telugu Lo Computer
0


సోమవారం గడిచిపోయిన నేపథ్యంలో మిగిలింది మంగళవారమే. ఎందుకంటే బుధవారం నుంచి ఆదివారం వరకు ఈ వారం దేశంలోని పలు బ్యాంకులకు వరుసగా సెలవులు ఉన్నాయి. ఈ బ్యాంకు సెలవులన్నీ అన్ని రాష్ట్రాలకు ఒకేలా వర్తించవు. ఏంటా సెలవులు అనుకుంటున్నారా..? సెప్టెంబర్‌ 8న (బుధవారం) శ్రీమంత శంకరదేవ తిథి, సెప్టెంబర్‌ 9న (గురువారం) తీజ్‌ పండుగ బ్యాంకుకు హాలీడే. ఇక సెప్టెంబర్‌ 10న (శుక్రవారం) వినాయక చవితిని పురస్కరించుకుని బ్యాంకులు తెరచుకోవు. సెప్టెంబర్‌ 11, 12 తేదీలు అనగా శనివారం, ఆదివారాలు బ్యాంకులకు సెలవు. 11న రెండో శనివారం కావడంతో బ్యాంకు సెలవు. ఆదివారం కూడా సెలవు కాబట్టి... బ్యాంకు పనులుంటే త్వరపడండి. ఈ పండుగలను జరుపుకునే రాష్ట్రాల్లో ఐదు రోజులు సెలవులు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో పై అన్నీ పండుగలను జరపుకోరు. పైన పేర్కొన్న పండుగలను జరుపుకోని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)