శ్రీ చైతన్యలో కరోనా కలకలం

Telugu Lo Computer
0


బెంగళూరులోని శ్రీచైతన్య రెసిడెన్షియల్‌ స్కూల్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో స్కూల్‌ను వచ్చేనెల 20 వరకు మూసివేశారు. ఆదివారం సాయంత్రం శ్రీ చైతన్య విద్యా సంస్థకు చెందిన ఓ విద్యార్థి వాంతులు చేసుకున్నట్లు, డైయేరియాతో ఇబ్బందిపడుతున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ తెలిపారు. వెంటనే  ఆ క్యాంపస్‌లో ఉన్న మొత్తం 480 మందికి పరీక్షలు నిర్వహించామని, అందులో 60 మందికి కరోనా నిర్ధారణ అయిందని చెప్పారు. పాజిటివ్‌గా తేలిన వారిలో ఇద్దరిలోనే లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరో వారం రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వైరస్ సోకినవారిలో 46 మంది కర్ణాటకు చెందిన వారు కాగా, మిగిలిన 14 మంది తమిళనాడుకు చెందినవారని తెలిపారు. శ్రీచైతన్య రెసిడెన్సియల్ స్కూల్‌ను నెలరోజుల క్రితమే పునఃప్రారంభించారని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)