ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ చిప్స్ కొరత

Telugu Lo Computer
0



ప్రపంచాన్ని సెమీ కండక్టర్‌ చిప్‌ల కొరత వేధిస్తోంది. కోవిడ్‌ దెబ్బకు డిమాండ్‌ పెరిగి సప్లయ్‌ తగ్గిపోవడంతో చాలా కంపెనీలు ఉత్పత్తి తగ్గించుకుంటున్నాయి. వాహనాలు, ఎలక్ట్రానిక్‌ రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. జియో ఫోన్‌ విడుదలపైనా చిప్ షార్టేజ్‌ ప్రభావం పడింది. యావత్‌ ప్రపంచాన్ని సెమీ కండక్టర్స్ చిప్స్ కొరత వేధిస్తోంది. దీంతో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా ఆటోమొబైల్ తయారీ కంపెనీలు వాహనాల ఉత్పత్తిలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. అతిపెద్ద యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా వాహనాల ఉత్పత్తిని 25 శాతం వరకు తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ నెలలో మారుతీ సుజుకీ ఉత్పత్తి సామర్థ్యం 40 శాతానికి తగ్గిపోవచ్చని ఆందోళన చెందుతోంది. అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజాలైన ఫోర్డ్‌, జనరల్‌ మోటార్స్‌ సహా జపాన్‌కు చెందిన టొయోటా నిస్సాన్‌ లాంటి సంస్థలు కూడా ప్రొడక్షన్‌ తగ్గించుకుంటున్నాయి. ఇక- ముఖేశ్‌ అంబానీ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న జియో నెక్స్ట్‌ ఫోన్లపైనా ఈ ప్రభావం పడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)