సాక్షి రంగారావు

Telugu Lo Computer
0


సాక్షి రంగారావు  పూర్తి పేరు రంగవఝుల రంగారావు. గుడివాడ వద్ద నున్న కొండిపర్రు గ్రామం ఈయన స్వస్థలం. తల్లిదండ్రులు రంగనాయకమ్మ, లక్ష్మినారాయణ. ఈయన నటించిన మొదటి సినిమా 1967లో విడుదలైన బాపూ-రమణల సాక్షి. మొదటి చిత్రం పేరు తన ఇంటిపేరు అయిపోయింది. దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్, వంశీ తమ సినిమాలల్లో ఎక్కువగా తీసుకొనే వారు. రంగారావు గారికి ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె. ఈయన చిన్న కుమారుడు సాక్షి శివ కూడా నటుడే. ఆయన సుమారు 450 సినిమాల్లో నటించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్టెనోగ్రాఫర్ గా పనిచేసేటప్పుడే ఆయన కిష్టమైన నాటకరంగంలో విరివిగా పాల్గొనేవారు. మొదట్లో ఆర్తితో నిండిన పాత్రల్లో నటించినా, సిరివెన్నెల, స్వర్ణకమలం, ఏప్రిల్ 1 విడుదల, జోకర్ మొదలైన సినిమాల్లో చేసిన పాత్రలు ఆయన్ను హాస్యనటునిగా ప్రాముఖ్యం కల్పించాయి. ఆయన నటించిన చివరి సినిమా కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వరాభిషేకం. 2005, మే 5 వతేదీన గురజాడ వారి నాటకం కన్యాశుల్కంలో గిరీశం పాత్రకు ఆయన రిహార్సల్ చేస్తుండగా గుండెనొప్పితో కుప్పకూలిపోయారు. హాస్పిటల్ కు  తరలించిన తరువాత తుదిశ్వాస విడిచారు. ఆ నాటకంలో ఆయనకది డ్రీమ్ రోల్ అని తరచూ చెబుతూ ఉండేవారు. చక్కెర వ్యాధి ముదిరి మూత్రపిండాలు పాడయిపోవడంతో చెన్నై వైద్యశాలలో జూన్ 27, 2005 రోజున 63 యేళ్ళ వయసులో మరణించారు 

Post a Comment

0Comments

Post a Comment (0)