సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ విద్వేష ప్రసంగాల కంటెంట్‌పై కఠినంగా వ్యవహరిస్తోంది. జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో 3.15 కోట్ల ప్రసంగాల కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 వేల కంటెంట్ వ్యూస్కుగాను ఇలాంటి విద్వేష కంటెంట్‌కు వచ్చే వ్యూస్ 5కి పడిపోయినట్లు తెలిపింది. అంతకుముందు మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఇలాంటి 2.52 కోట్ల కంటెంట్‌ను తొలగించింది ఫేస్బుక్. ఈ చర్యల వల్ల తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో విద్వేష ప్రసంగాల విస్తృతి చాలా వరకు తగ్గిందని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ ఇంటిగ్రిటీ గయ్ రోజెన్ చెప్పారు. ఫేస్బుక్ తొలిసారి ఇలాంటి కంటెంట్‌ను రిపోర్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇలాంటి కంటెంట్‌ను తొలగించడం 15 రెట్లు పెరిగినట్లు ఆయన తెలిపారు.
మూడు కోట్ల విద్వేష ప్రసంగాలను తొలగించిన ఫేస్బుక్
أغسطس 19, 2021
0