ఇదేమి చోద్యం !

Telugu Lo Computer
0



ప్లీజ్ గిన్నెలు తోమి వెళ్లండి. 

వేరే వ్యక్తికి అప్పగించడానికి మా దగ్గర డబ్బుల్లేవ్. 

బడ్జెట్ దాటిపోయిందంటూ చేసిన కొత్త జంట రిక్వెస్ట్ కు గెస్ట్ లు షాక్ అయ్యారు. అలా పెళ్లికి వెళ్లిన వారిలో ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి ఘనంగా చేసుకోవాలని భావించారో ఏమో.. భారీ వేదికను మాట్లాడుకున్నారు. అంతే పెళ్లి ఏర్పాట్లలో ఒకొక్కటి పెరుగుతూ చివరికి వాళ్ల బడ్జెట్ దాటిపోయింది. కాంప్రమైజ్ అయిన ఆ జంట సెల్ఫ్ క్యాటరింగ్ పని పెట్టుకున్నారు. అంతేకాదు పెళ్లికి వచ్చిన గెస్ట్ లను గిన్నెలు తోమి వెళ్లాలంటూ రిక్వెస్ట్ చేశారు. ఈ ఘటనతో పెళ్లికి వచ్చిన గెస్ట్ లు షాక్ అయ్యారు.

పెళ్లి కూతురు మా బంధువు. పెళ్లి కోసం చాలా ఖరీదైన వేదికను మాట్లాడుకున్నారు. అందమైన వేడుకను ఏర్పాటు చేశారు. ఫొటోలకు కూడా బాగానే వెచ్చించారు. బఫె, టేబుల్స్ ఏర్పాటు అంతా బిల్డింగ్ నమూనాలోనే ఉంది. ఫుడ్ చాలా గొప్పగా అనిపించింది. నా ప్లేట్ లో పెట్టుకుని వెళ్లి కూర్చొని తింటున్నాను. అక్కడ ఉన్న రెస్ట్ రూంకు వెళ్లి నా భర్త వచ్చారు. ఖాళీ ప్లేటుతో వెనక్కు రావడంతో ఏమైంది అని అడిగాను. అక్కడ ఫుడ్ ఇక లేదు అయిపోయిందని చెప్పాడు. పెళ్లికూతురు తల్లిని పిలిచి క్యాటరర్లతో ఇంకొంచెం ఫుడ్ తెప్పించమని చెప్పా. ఆమె కూడా అదే చెప్పింది ఇక ఫుడ్ లేదని. ఫుడ్ కూడా చాలా కాస్ట్లీగా ఆర్డర్ ఇచ్చారట. తక్కువ మంది వస్తారని భావించి ఏర్పాట్లు చేస్తే.. అది మూడో వంతు మందికి మాత్రమే సరిపోయింది. మిగిలిన వారు ఆకలితోనే వెళ్లిపోయారు. ఇంతకంటే దారుణమైన విషయమేమిటంటే.. కొందరు గెస్ట్ లను గిన్నెలు కూడా కడగమన్నారు. పెళ్లికొడుకు, కూతురు వాళ్లకు వచ్చిన డబ్బులతో వేదికగా కట్టాల్సిన బిల్లులో కట్టేయాలని ఫిక్స్ అయ్యారు. పెళ్లికూతురు ఆ డ్రెస్ లోనే సర్వ్ చేస్తుంటే సరదాగా చేస్తుందనుకున్నాం. ఆ తర్వాత డిన్నర్ అయిపోయింది. మా దగ్గరకు వచ్చి కిచెన్ లోకి రమ్మంది. అక్కడ పేరుకుని ఉన్న ప్లేట్లను కడగమని అడిగింది. గిన్నెలు, పాత్రలు అన్నీ సాయంత్రం వరకూ కడిగి ఇవ్వలేకపోతే ముందుగా ఇచ్చిన డిపాజిట్ లో కట్ చేసుకుంటామని చెప్పారంట. అప్పుడే కొత్త జంట పైసాపైసా లెక్కపెట్టుకుంటూ.. అవి తోమడానికి మనుషులను కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఇక నాతో పాటు మరో 9మంది బంధువులు సబ్బు, నీళ్లతో గిన్నెలు క్లీన్ చేసి వచ్చాం.అంత పొదుపు చేసి పెళ్లి చేసుకున్న జంట.. మూడేళ్లకే విడాకులు తీసేసుకున్నారు. ఆమె రెండో పెళ్లికి మరోసారి ఇన్విటేషన్ పంపితే నేను రానని చెప్పాశా అంటూ ఆమె పర్సనల్ అకౌంట్ లో పోస్టు చేశారు. దీనిపై పలు రకాల కామెంట్లతో రెస్పాన్స్ ఇస్తున్నారు నెట్ జన్లు.  

Post a Comment

0Comments

Post a Comment (0)