స్వీపర్ నుంచి డిప్యూటీ కలెక్టర్.....!

Telugu Lo Computer
0


రాజస్ధాన్ లోని జోధ్ పూర్ కు చెందిన ఆశ ఎనిమిది సంవత్సరాల క్రితం భర్తతో విడిపోయింది. తన ఇద్దరు పిల్లలను పెంచే బాధ్యతను తీసుకున్న ఆమె జోధ్ పూర్ మున్సిపల్ కార్పోరేషన్ లో మహిళా స్వీపర్ గా చేరింది. ఉదయాన్నే నిద్రలేచి నగరంలోని రోడ్లు ఊడ్చే పనిలో నిమగ్నం కావటం ఆమె విధి నిర్వాహణ. తన పై స్ధాయి అధికారులు తరచూ పర్యవేక్షణ కోసం నగరంలో తిరుగుతున్న సమయంలో వారిని దగ్గరగా గమనించిన ఆశ ఎలాగైనా తాను కూడా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఒకవైపు స్వీపర్ గా రోడ్లు ఊడ్చే ఉద్యోగం చేస్తూనే కష్టపడి చదువుకుంది. డిగ్రీ విద్యను పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎదురు చూస్తూ వాటికోసం చదవటం ప్రారంభించింది. ఈ తరుణంలో 2018లో రాజస్ధాన్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్ ఆర్ ఏ ఎస్ పరీక్షలు రాసింది. కారోనా కారణంగా ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది. ఇటీవలే ఫలితాలు వెలువడగా అందులో ఆశా కు 728వ ర్యాంకు లభించింది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు విభాగాల్లోనూ ఆశ ఉత్తీర్ణత సాధించింది. త్వరలో ఆశ డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టనుంది.ఆశ పట్టుదలకు స్ధానికులంతా అభినందనలు తెలుపుతున్నారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)