సామెతలు ....!

Telugu Lo Computer
0

 

* ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు !

* ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే... చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట !

* ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో?

* ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు !

* ఆశగలమ్మ దోషమెరుగదు... పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు

* ఇంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా?

* ఇంటికి ఇత్తడి పురుగుకు పుత్తడి !

* ఇద్దరు ముద్దు ఆపై వద్దు

* ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె !

* ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లు !

* ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు !

ఇల్లు ఇరుకుగా ఉండాలి, పెళ్ళాం చంఢాలంగా ఉండాలి !

* ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట !

* ఈశ్వరుడుకి విభూది లెకుంటె పార్వతి పాండ్స్ అడిగినట్లు !

* ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు !

*  ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు !

* ఊరికి ఉపకారి ఆలికి అపకారి !

Post a Comment

0Comments

Post a Comment (0)