దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకలే !

Telugu Lo Computer
0


వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అమీర్‌పేటలోని అస్టర్‌ప్రైమ్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ నటుడు సుమన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వైద్యుల గొప్పతనం గురించి మాట్లాడిన ఆయన పరోక్షంగా ‘మా’ ఎన్నికల వ్యవహారం గురించి స్పందించారు. ‘మా’ ఎన్నికల కారణంగా తెరపైకి వచ్చిన లోకల్‌ నాన్‌లోకల్‌పై పరోక్షంగా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకల్‌ కిందే లెక్కని, కాబట్టి అందరూ కలిసి కట్టుగా ఉండాలని, లోకల్‌-నాన్‌ లోకల్‌ అనే దానిని  ప్రస్తావించడం అర్థరహితమని ఆయన అన్నారు. అలాగే వైద్యులు, రైతులు నాన్‌లోకల్ అనుకుంటే ప్రజలకు చికిత్స, ఆహారం అందదని ఆయన తెలిపారు. తెలుగు నటీనటుల సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు సుమన్ పరోక్షంగా మద్దతు ప్రకటించారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)