అబ్బో! యెంతో పొడుగివి!

Telugu Lo Computer
0

 


యబ్బురమీ కాయలుగన నాహా! వింతే!
నిబ్బరమగు బొప్పాయి యె
యిబ్బిడి ముబ్బిడి పెరుగగ నింపు నొదవగన్.
మదనానపకాయ యనుచు
నిదివఱలో దీని పేరు నిటునటు వినగన్
కుదురుగ బొప్పాయి నిపుడు
నిదె! నానప వోలె కాసె నిపుడిట జాడన్.
జన్యు మార్పులు ప్రాణులన్ జరిగినంత
వింత వింతగు సృష్టియే వెల్లి విరియు
పొడుగు బొప్పాయి కాయల నిడివి జూడ
నబ్బురంబుగ దోచెనే యంద గించ.
-శిష్ట్లా తమ్మిరాజు

Post a Comment

0Comments

Post a Comment (0)