నిజాయితీ ....!

Telugu Lo Computer
0


విజయనగర సామ్రాజ్యములో ఒక వూరిలో రామ శర్మ, లక్ష్మణ శర్మ అనే స్నేహితులుండేవారు.రామ శర్మ కు  ఒక కూతురు, లక్ష్మణ శర్మ కు ఒక కొడుకు వుండే వారు. ఒకసారి రామశర్మ కు  ఏదో అవసరం వచ్చి తన ఎకరా పొలాన్ని లక్ష్మణ శర్మ కు అమ్మేశాడు. లక్ష్మణ శర్మ  తాను కొనుక్కున్న ఆ పొలం  లో దున్నుతుండగా ఒక 

లంకెబిందె దొరికింది. దాన్నిండా బంగారు నాణాలు వున్నాయి.లక్ష్మణ శర్మ ఆశ్చర్య పోయి ఆ లంకె బిందె తీసుకొని పోయి రామశర్మ కు చూపించి యిది నీపొలం లో దొరికింది యిది నీకే చెందుతుందిఅన్నాడు. అందుకు 

రామశర్మ కాదు కాదు నా పొలం నీకు అమ్మి వేశాను. అందులో దొరికినది ఏదయినా నీదే అన్నాడు. కాదు నీదే 

అంటే నీదే  అని వాదులాడుకోసాగారు. యిది సరి కాదని రాయల వారి దగ్గరికి వెళ్లి తీర్పు అడుగుదాము అనుకోని రాయల వారి సభకు వెళ్లి వారి సమస్య చెప్పారు. రాయలు వారి నిజాయితీని మెచ్చుకొని, దీనికి  తీర్పు ఎవరయినా చెప్పగలరా? ఆ ధనం ఎవరికి చెందుతుంది? అని అడిగాడు. తెనాలి రామకృష్ణుడు లేచి మీ యిద్దరికీ సమ్మతమైతే మీ కొడుక్కు వారి కూతురు నిచ్చి వివాహం చేసి వారికి యీ ధనాన్ని యిచ్చి వేయండి. అది వారిద్దరికీ  మాత్రమె చెందుతుంది. మిగతా కుటుంబ సభ్యులకు దాన్ని అనుభవించడానికి హక్కు వుండదు అని తీర్పు చెప్పాడు.. ఆ తీర్పు అందరికీ నచ్చింది. రామశర్మ కూతురికీ లక్ష్మణ శర్మ కొడుక్కీ వైభవంగా వివాహం జరిపించి ఆ బంగారు నాణాలు వారికి యిచ్చి వేశారు. ఆ ధనం తో వారిద్దరూ సుఖంగా జీవించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)