అనుసరణ

Telugu Lo Computer
0

 


ఒక బ్రాహ్మణుడు,అతని భార్య గోదావరి నది ఒడ్డున కాపురము వుంటున్నారు. అది . కార్తీకమాసం. అతని భార్య నాకు తీరిక లేదు నదికి వచ్చేందుకు.అని ఒక ఇత్తడి చెంబు బాగా తెల్లగా తోమి యిచ్చి మీరు వెళ్లి నదిలో స్నానం చేసి ఈ చెంబులో నీళ్ళు పట్టుకొని రండి.అని చెప్పింది. అతను చెంబు పట్టుకొని నదికి వచ్చాడు. యింకా ఎవరూ రాలేదు. అంతా నిర్మానుష్యంగా వుంది. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. తను చెంబు గట్టున పెట్టి  స్నానానికి వెళితే ఎవరైనా ఈ చెంబును పట్టుకొని పోతారేమోనని అక్కడే ఇసుకలో గుంత చేసి అందులో చెంబు పెట్టి గుర్తు కోసం దాని పైన శివలింగం చేసి నది లోకి దిగాడు. తర్వాత వచ్చిన వాళ్ళంతా ఈ శివ లింగాన్ని చూసి యిలా లింగం చేసి పెట్టి స్నానానికి వెళితే పుణ్యమేమోనని తలచి  తలా ఒక శివలింగం తలా ఒక శివలింగం చేసి పెట్టి నదిలోకి  దిగారు. ఆ బ్రాహ్మణుడు స్నానం చేసి, తన అనుష్టానం ముగించుకొని వచ్చే సరికి ఒడ్డున వందల కొద్దీ శివలింగాలు తయారయ్యాయి. అందులో తన చెంబు వుండేది ఏదో తెలియలేదు. ఆ లింగాలను చెరిపితే  మిగతా వాళ్ళు దెబ్బ లాటకు వచ్చే ప్రమాదముంది. అందుకని చేసేదేమీ లేక నీళ్లు తేకపోగా పోగొట్టావని భార్య తిడుతుందని భయ పడుతూ యింటికి వెళ్ళాడు. మన వాళ్లకు స్వయంగా ఆలోచించే శక్తి లేదు.ఎవరో ఏదో చెప్పారనీ, చేశారనీ గుడ్డిగా  అనుసరించేయడమే.

"గతానుగతికో లోకో నలోకః పారమార్థికః" ఏదైనా చేసేముందు దానిలో ఏదైనా పరమార్థం వుందా? లేదా? అని చూసుకోకుండా వేరేవాళ్లు ఏదో చేశారని వాళ్ళని అనుసరిస్తూ పనులు చేసేవాళ్ళు లోకం లో ఎక్కువ.

Post a Comment

0Comments

Post a Comment (0)