మన ప్రాచీన విజ్ఞానం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 27 July 2021

మన ప్రాచీన విజ్ఞానంప్రాచీన భారతం లో వ్యవసాయశాస్త్రం ఏంతోపరిణతి చెంది ఉంది క్రీ.పూ.నాలుగు వందల కాలం వాడైన పరాశర మహర్షి మన మొదటి వ్యవసాయ పరిశోధకుడు .ఆయన రాసిన ‘’ కృషి పరాశర’’ ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపు పొందింది . అందులోని విషయాలు ఈ నాటికీ అనుసర ణీయాలుగా ఉన్నాయి .భారత దేశం లో తప్ప ప్రపంచం మొత్తం మీద ఏ నాగరక దేశమూ ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని వ్యవసాయ శాస్త్ర పరిశోధనకు ఉపయోగించ లేదు .మనకు ఖగోళ శాస్త్రాధ్యయనం అతి పరిణతి చెందిన కాలం లో ఇంకా ఆయా దేశాల వారు అందులో తప్పటడుగులు వేస్తూ ప్రాధమిక దశలోనే ఉన్నారు . ఆ దేశాలలో ఋతుపవన ప్రభావం పెద్ద గా లేక పోవటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు ‘’ కృషి పరాశర ‘’ లో ఈ నాటి ఆధునిక సాగు అయిన ‘’శ్రీ వరి ‘’.పద్ధతుల వంటి అనేక వ్యవసాయ యాజ మాన్య పద్ధతులు , సేంద్రియ వ్యవసాయ విధానాలూ ఉన్నాయి

విత్తనాల సేకరణ , నిల్వ పద్ధతులూ ఉన్నాయి . వరాహ మిహిరుడు రాసిన ‘’బృహత్ సంహిత ‘’లో వ్యవసాయ సాగు విధానాలు , ఋతు పవనాల రాకను లెక్కగాట్టే పద్ధతులు ఉన్నాయి . సుశ్రుతుడు వైద్య శాస్త్ర పితామహుడని పించుకోన్నప్పటికి ‘’బాస్మతి ‘’వంటి సుగంధ పరిమళాలను వెదం జల్లే వరి ధాన్యపు రకాలను ప్రస్తావించాడు .కశ్యప మహర్షి కూడా తన గ్రంధం లో వ్యవ సాయ అమ్శాలేన్నిటినో వివరించాడు . ఈ రోజు మనం చెప్పుకొనే ‘’గోల్డెన్ రైస్ ‘’బియ్యపు రకం , ద్రుష్టి లోపాలను సవరించే బియ్యం , జీర్ణ శక్తిని పెంచే బియ్యం రకాల వర్ణన కూడా ఉంది ఈయనా రాసిన ‘’కాశ్యపేయ కృషి సూక్తి ‘’ఈ నాటికీ మార్గ దర్శనం చేస్తోంది .

1900లో ‘’ఆయుర్వేద భిషాగ్రణి’’బిరుదు పొందిన ‘’సురపాలుడు ‘’’’వ్రుక్షాయుర్వేదం ‘’అనే గ్రంధాన్ని రాశాడు .ఇందులో వరి నాటటం దగ్గర్నుంచి దిగుబడి వరకు అన్నిటి వివరం ఉంది . విత్తన శుద్ధి , దుక్కి , వివిధ సాగు పద్ధతులు , సాగు నీటి క్రమం భూ గర్భ జల వినియోగం ,చీడ పీడలకు వేప విత్తనాల వాడకం పెంటపోగు (కంపోస్ట్ ఎరువు) తయారీ లను కూడా చర్చించిన గ్రంధం ఇది .దీనిలో పర్యా వరణ పరి రక్షణ కూడా ఉండటం ఇప్పటి వారికి ఆశ్చర్యం కలిగించే విషయం . ప్రాచీన వ్యవసాయ పరి శోధకులలో ‘’చక్ర పాణి మిశ్రా ‘’పేరొందిన వాడు .ఈయన మహా రాణా ప్రతాప్ఆస్తాన శాస్త్ర వేత్త . వ్యవసాయ పరిశోధనా గ్రంధం రాసిన శేస్ట పరిశోధకుడు భూగర్భ జల వాడకం పై ద్రుష్టి ఎక్కువ గా పెట్టాడు . వ్యవసాయ బావులు , చెరువుల నిర్మాణ విధానాలు వివరించాడు .భూగర్భ జలాలను ఏ విధం గా అన్వేషించి కనుగొని ఉపయోగించాలో స్పష్టం గా రాశాడు .ఈయన గ్రంధం ఇంగ్లీష్ లోకి అనువాదమైన్దికూడా .ఎన్నో మన ప్రాచీన వ్యవసాయ శాస్త్ర గ్రంధాలు శిధిలమై పోవటమో విదేశాలకు తరలింప బడతమో జరిగి వాటి విలువ మనకు తెలియ కుండా పోయింది .

వరి పంట

భారత దేశం లో 15,000 సంవత్సరాల నుండి వరి సాగు ప్రధానమైన పంట .ఆ కాలం లో 30 ,000పైగా వరి ధాన్యపు రకాలున్దేవి . వరి పంట13 కోట్ల సంవత్స రాల కిందటే ఉందని అంచనా . ఈ రోజు ప్రపంచం మొతం మీద రెండు లక్షల వరి రకాలున్నాయని అంటున్నారు .250 కోట్ల జనాభా కు వరి ఆహారం గా ఉంది ఆసియా లో 92శాతం ప్రజలకు ఆహారం వరి యే. ప్రపంచ వరి ఉత్పత్తిలో 97 శాతం ఆసియాలో నే ఉత్పత్తి అవుతోంది .ఇప్పటికీ పది హీను కోట్ల హేక్తారులలో వరి సాగు చేస్తున్నారు .

వర్షాన్ని కొలిచే విధానం

కృషి పరాశర లో ‘’శత యోజన విస్తీర్ణం త్రిమ్శాద్యోజన ముచ్చ్రితం

‘’అఢ’’కస్య ‘’భవే న్మానం మునిభిహ్ పరి కీర్తితమ్ ‘’

వంద యోజనాల విస్తీర్ణాన్ని ‘’ఆడకం ‘’అంటారు మూడు వందల యోజనాల ఎత్తులో ఉండే నీటి మొత్తం యెంత అని చెప్పే శ్లోకం ఇది .ఇక్కడ యోజనం అంటే దూరం తో సంబంధం ఉన్నదికాడు –‘’చూపుడు వేలు పొడవుతో సమాన మైనది ‘’అని అర్ధం .చాణక్యుడు కూడా అర్ధ శాస్త్రం లో వర్షాన్ని కొలిచే పధ్ధతి చెప్పాడు .ద్రోణ అంటే 6.4సెంటి మీటర్లు .వర్ష పాతాన్ని కొలిచే కొలత నాలుగు ఆఢకాలు .

సంఖ్యలకు అక్షరాలే సంకేతకాలు

ఆర్య భట్ రాసిన ‘’ఆర్య భట్టీయం ‘’మొదటి ప్రకరణం లో అంకెలను సంఖ్యలను అక్షరాల రూపం లో కుదించి యెంత భారీ సంఖ్య నైనా ఒక చిన్న పదం గ చెప్పేందుకు మార్గ దర్శనం చేశాడు .అందరికి అర్ధం కాక అది దూరమైంది .ఆర్య భట సాంకేతిక విషయం తెలుసు కొందాం .

అ=1,ఆ=100,ఉ =100,ఋ=1000,ఇ=10000,ఏ =1,00000,ఐ=1,000000,ఔ=1,0000000,ఒ=1,00000000

అలాగే హల్లులకు విలువలిచ్చాడు క=1,ఖ=2,గ=3—ద=19,న=20 —-మ=25,య=30,ర=40 ల=50,వ=60,శ=70,ష=80,స=90,హ=100

సూర్యుడి భ్రమణాల సంఖ్య ను వివరించటానికి ఆర్య భట ‘’ఖ్యుఘ్రు’’అనే మాటన వాడాడు .ఆయన దీని పై ఒక శ్లోకం చెప్పాడు ఇందులో పదాలను విడగొడితే ఖ +ఉ+య+ఘ+ఋ.వీటిని పైన చెప్పిన సంకేతాల సంఖ్యకు అను వర్తింప జేస్తే 43,20 ,000అవుతుంది ఈ సంఖ్యయే సూర్య భ్రమణాల సంఖ్యగా ఆర్య భట తెలియ జేశాడు .ఇదీ మన ప్రాచీన విజ్ఞానం

8 comments:

 1. తెలుగులో వాటిని అనువదించి, సామాన్య రైతుకుకూడా అర్ధమై.. వాటిని పాఠించేలాగున చేయలేమా?

  ReplyDelete
 2. మంచి ప్రశ్న. తప్పకుండా ఆ దిశలో కృషి చేయాలి. ఐతే ఇలాంటి కృషిని ఒంటిచేత్తో చేయటం మహాకష్టం. ఎన్నో సాంకేతికమైన విషయాలను ప్రస్తావిస్తూ వివరిస్తూ ప్రతిగ్రంథాన్నీ దేశభాషల్లోనికి అనువదించటం అసాధ్యం - గ్రంథవిస్తరణ భీతీ, ప్రతిగ్రంథంలోనూ అలా చేయవలసి రావటం అన్న ప్రయాస వంటివి ఎన్నో ప్రతిబంధకాలుగా వస్తాయి. కాబట్టి అంచెలంచెలుగా శాస్త్రనిర్మాణం దేశభాషల్లోనికి తీసుకొని రావాలి. అప్పుడు వాటిని అధ్యయనం చేసే అవకాశం దేశభాషల్లో అక్షరాస్యులైన అందరికీ వీలౌతుంది. అలాగే అనేక గ్రంథాలు దేశభాషల్లోనే ఉన్నవి కూడా అప్పటి సంప్రదాయాన్ని అనుసరించి ఛందోబధ్ధంగా వ్రాయబడి కొంతవరకూ దురవగాహంగా ఐపోయాయి - వాటినీ వచనరూపంలోనికి తేవాలి తప్పకుండా. ఇటువంటి కృషిని సంస్థాగతంగా చేయటం మంచిది. పూనుకొనే సంస్థలున్నాయా అన్నది ప్రశ్న.

  ReplyDelete
 3. With a small part of the above vast knowledge, Mr. parulekar designed a system of cultivation by raring one country cow and 20 acres of land can be cultivated with zero investment.

  Some people implemented it and the results were amazing. This is discouraged by agri university and the babus. If this is implemented the university is to be revamped from top to bottom or closed.The fertiliser and pesticides factories are to be closed.

  Nobody dared to propagate and implement it, naturally died down.

  ReplyDelete
 4. >>agri university
  Which university?

  >>The fertiliser and pesticides factories are to be closed
  How long will you play the same old record? Leaders and people who are fighting for our ancient culture can contribute na?

  ReplyDelete
 5. >>ఐతే ఇలాంటి కృషిని ఒంటిచేత్తో చేయటం మహాకష్టం.

  ఇంతమాత్రం దానికి ఆసంఘ్ లు, ఈ సంఘ్ లు ఎందుకండీ? వేల కోట్లు రామాలయం కోసం పోగుచెయ్యగలిగినవాళ్ళు, రైతులకోసం ఏం చెయ్యరా?

  ReplyDelete
 6. ఈ సంస్థలు సంఘాలూ మంచి ఉద్దేశం తోనే ఏర్పడతాయి సాధారణంగా. కాని వాటిని నియంత్రించేది చిత్తశుధ్ధికల పెద్దలైతే మంచిదే. కాని క్రమంగా నియంత్రణలు ఓట్లమీదే దృష్టి కలిగిన పార్టీలూ ప్రభుత్వాలూ అయేసరికి అవి నిర్వీర్యం అవుతున్నాయి. చైతన్యం కలిగిన ప్రజలు ఈటరిస్థ తిని అడ్డుకోగలరు కాని సామాజిక చైతన్యం ఎలా ఉన్నదీ చూస్తూనే ఉన్నాం కదా.

  ReplyDelete
 7. మిగితావాటి సంగతేమోగానీ.. ఆర్ ఎస్ ఎస్ అంటే అప్పటికీ, ఇప్పటికీ.. నాకు మంచి అభిమానమేనండీ. ఎక్కడ ప్రకృతి విపత్తులు జరిగినా.. ప్రభుత్వంకంటే ముందే వాళ్ళు చేరిపోయి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీడియా కెమేరాలకోసం వెంపర్లాడే దురద లేకుండా.

  ReplyDelete