ఆశకు అంతు లేదు !

Telugu Lo Computer
0


పూర్వమొక ధనవంతుడుండెడివాడు. అతడికి వందలకొలది ఎకరముల భూసంపద వున్నది. కాని అతడికి సంతృప్తి లేదు. ఇంకను వేలకొలది ఎకరములభూమిని చౌకగా లభించినచో కొనవలెనని ఆశపడు

తుండెను. ఇంతలో హిమవత్పర్వత ప్రాంతాల్లో విశాలమగు పీఠభూమి చౌకగా లభించగలదని, ఆ భూమి అక్కడ అరణ్యమందలిఒక కోయరాజు వశమున కలదని తెలిసి ప్రయాణమయ్యెను. పట్టణములలో లభించుచున్న విచిత్రములైనఆటవస్తువులను, చాలినంత తినుబండారములను కొనుగోలు చెసెను. భూయజమాని కోయదొరను కలిసి తాను సేకరించి తెచ్చిన వింతవింత ఆట సామగ్రి, తినుబండారము లను కానుకగా సమర్పించగా అతడు మహదానందభరితుడై ఆ ధనికునితో -- "తమరు ఇటు ఏలవచ్చిరి?మీకేమి సహాయముకావలయునో చెప్పిన తీర్చగలనని" వాగ్ధానము చేసెను. వెంటనే ధనికుడు తనకు ఈ పరిసరమున కొంతనేలకావలయునని తెలుపగా కోయరాజు
"అట్లే ఇచ్చెదను. దానికి ఏమియు తనకు చెల్లించనవసరము లేదని చెబుతూ "ఎంతయో నేల ఇక్కడ వ్యర్థముగానున్నది.దానిని మీరు సాగు చేసుకుని ఉపయోగించుకొనవచ్చును. అయితే ఒక షరతు. రేపు ఉదయమే సరిగా 6గంటలకుమీరిచటనుండి బయలుదేరి మీ ఇష్టము వచ్చి
నంత దూరము నడిచి మరల తిరిగి సాయంత్రం 6 గంటలకల్లా ఈ చోటికి రావలెను. అపుడు మీరు నడిచినంత నేల మీపరమగును." ఆవాక్యములను ధనికుని ఆనందమునకు మేరలేదు. తన జీవితము కృతార్థమైనదని తలచి మరుసటి రోజుఉదయంఎప్పుడగునా యని వేచి వుండెను.
తెల్లవారినది. కోయరాజు ఒక ప్రదేశమును చూపి "ఈ చోటునుండి ఎంతదూరమైనను నడిచి వెళ్లి సాయంత్రం ఆరుగంటలకల్లా తిరిగి ఇక్కడకు చేరుకున్నచో ఆ నేల యంతయు తమరి సొంతము కాగలదని" అనగా ఆ ధనికుడు వెంటనే నడక ప్రారంభించెను. నడిచినచో కొద్ది స్థలమే రాగలదని భావించి పరుగెత్తనారంభించెను. ఈ ధనికుడు స్థూలకాయుడు. అది గ్రీష్మ ఋతువు. మధ్యాహ్న ఎండసమయము.అతనికి ఆయాసము హెచ్చెను. చెమటలు కారసాగెను. పరుగిడుచున్న ఈయననుచూసి బాటసారి ఒకడు జాలితో "అయ్యా! ఈ పాత్రలోని పానీయము త్రాగి దప్పిక తీర్చు
కొనుడు." అని పాత్ర అందజేయబోగా ధనికుడు తృణీకరించి "అయ్యా! ఈ సమయమున నన్నేమియు పలుకరించకండి. మీరిచ్చు నీళ్లుత్రాగులోపలమరికొంతస్థలము ఆక్రమించుకొనగలను." అని పలుకుతూ తన పరుగును కొనసాగించెను. ఇలా పరుగెత్తి పరుగెత్తి ఆయాసము పెరిగి శోషచే క్రిందపడిపోయెను. కోయరాజు తదితరులు వచ్చిచూడగా ధనికుడుస్పృహతప్పి పడివుండెను.క్రమముగా నాడి సన్నగిల్లినది. మరి మూడు నిమిషములకే ఆ ధనికుని ప్రాణవాయువుఅనంతవాయువులలో కలిసి పోయెను.జనుల ఆశకు అంతులేదు. ఈ తృష్ణ మానవునకు ఎంతమాత్రం క్షేమం కాబోదు. దేవుడిచ్చినదానితో తృప్తి చెంది ఆ పరాత్పరుని నామోచ్ఛారణ నిరంతరం చేయుచూ ధన్యులు కావలెను.

Post a Comment

0Comments

Post a Comment (0)