18 జిల్లాల్లో ఫూలన్‌దేవి విగ్రహాలు !

Telugu Lo Computer
0


కొంతమంది కిరాతకురాలు అని పిలిచినా.. కొందరు వీరనారిగా అభివర్ణించినా పూలన్ దేవి విగ్రహాలను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చెయ్యబోతున్నట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వికాషీల్ ఇన్సాన్ పార్టీ (VIP) ప్రకటించింది. నిషాద్ సమాజాన్ని ఆకర్షించే చర్యలో భాగంగా జూలై 25న ఉత్తరప్రదేశ్‌లోని 18నిషాద్ ఆధిపత్య జిల్లాల్లో దివంగత బందిపోటు రాణి  ఫూలన్ దేవి బంగారు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. 20వ వర్ధంతి  సందర్భంగా మొత్తం 18 జిల్లాల్లో వేడుకలు నిర్వహించి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వి ఐ పి  చీఫ్ ముఖేష్ సాహ్ని ప్రకటించారు. ప్రస్తుతం నితీష్ కుమార్ ప్రభుత్వంలో భాగమైన సాహ్ని జూలై 2న తన పార్టీ ఉత్తరప్రదేశ్ యూనిట్‌ను ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే ఫూలాన్ దేవి విగ్రహాన్ని వారణాసి అధికారులు జప్తు చేశారు. ఈ విగ్రహాలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తాయనే ఉద్ధేశ్యంతో విగ్రహాలను వ్యవస్థాపించక ముందే జప్తు చేశారు అధికారులు. యూపీలోని 18 జిల్లాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయాలని భావించగా.. ఈ విగ్రహాలను ట్రక్కుల ద్వారా యూపీకి పంపారు. ఈ విగ్రహాలను వారణాసితో పాటు లక్నో, బల్లియా, సంత్ కబీర్ నగర్, బండా, అయోధ్య, సుల్తాన్‌పూర్, గోరఖ్‌పూర్, మహారాజ్‌గంజ్, ప్రయాగ్రాజ్, ఉన్నవో, మీరట్, మిర్జాపూర్, సంత్, మువిజార్‌లలో ఏర్పాటు చెయ్యాలని అనుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)