జులైలో 11 పబ్లిక్‌ ఇష్యూలు

Telugu Lo Computer
0


జూన్‌లో ప్రాంభమైన పబ్లిక్‌ ఇష్యూల కోలాహలం జులైలో మరింతగా పెరగనుంది. ఈ నెలలో 11 కంపెనీలు తొలి పబ్లిక్‌ ఆఫర్‌లు (ఐపీఓ) నిర్వహించే అవకాశం ఉంది. తద్వారా మొత్తంగా ఇవి రూ.24,000 కోట్లు సమీకరించొచ్చని అంచనా. స్పెషాలిటీ రసాయనాల తయారీ సంస్థ క్లీన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, జీఆర్‌ ఇన్‌ఫ్రాలతో జులైలో పబ్లిక్‌ ఇష్యూల సందడి మొదలుకానుంది. ఈ రెండు సంస్థల పబ్లిక్‌ ఇష్యూలు ఈనెల 7న ప్రారంభమై 9న ముగియనున్నాయి. వీటితో పాటు ఈ నెలలో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న మిగిలిన 9 కంపెనీలు : క్లీన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, జీఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌, గ్లెన్‌మార్క్‌ లైఫ్‌సైన్సెస్‌, విజయా డయాగ్నస్టిక్స్‌, శ్రీరామ్‌ ప్రోపర్టీస్‌, ఉత్కర్ష్‌ స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంక్‌, అమి ఆర్గానిక్స్, సెవన్‌ ఐలాండ్స్‌ షిప్పింగ్‌, నువోకో విస్టాస్‌, ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఆరోహన్‌ ఫైనాన్షియల్‌. 

Post a Comment

0Comments

Post a Comment (0)