అద్దెకి బాల్కనీ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Sunday, 4 July 2021

అద్దెకి బాల్కనీ !

100+ Balcony Pictures | Download Free Images on Unsplash


టొరంటోలో నివాసముంటున్న 24ఏళ్ల ర్యాన్​ అల్రుషుద్​ ఓ అపార్ట్​మెంట్​లోని 60వ అంతస్తులో నివాసముంటున్నాడు. తన ఇంటి బాల్కనీ నుండి నగరం మొత్తం ఎంతో అందంగా కనిపిస్తుంది. దీంతో తన అపార్ట్​మెంట్​ బాల్కనీని అద్దెకు పెట్టేశాడు​. సహజంగానే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు అందమైన ఫోటోల కోసం నెటిజన్లు వెంపర్లాడుతున్న సంగతి తెలిసిందే కదా. దీంతో ఈ అద్దె బాల్కనీకి ఫుల్ డిమాండ్ వచ్చేసింది. ర్యాన్​ బాల్కనీని ఉపయోగించుకుని నెటిజన్లు అద్భుతమైన ఫొటోలు దిగుతుండగా,  అవి సామాజిక మాధ్యమాల్లో మంచి లైక్స్​ తెచ్చిపెడుతున్నాయి.  ఫొటో ప్రేమికులకు ఇది ఇప్పుడు హాట్​స్పాట్​గా మారిపోయింది. తన బాల్కనీలో ఫొటోలు దిగేందుకు, మోడల్స్​కు ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లను అందుబాటులో ఉంచిన ర్యాన్.​. మనిషికి గంటకు 25డాలర్లు చొప్పున వసూలు చేస్తున్నాడు. బాల్కనీని అద్దెకు తీసుకున్న వారికి బాత్​రూం, వైఫై​ అదనంగా ఇస్తున్న ర్యాన్ ఒక్కసారి కేవలం ముగ్గురికే అనుమతి ఇస్తున్నాడు. స్వతహాగా ఫోటో గ్రాఫర్ అయిన ర్యాన్.. గతంలో ఫోటో స్టూడియోలకు బోలెడు డబ్బులు తగలేసి.. ఇప్పుడు అలా మంచి ఫోటోలను కోరుకొనే వారి దగ్గర నుండే తిరిగి ఆ డబ్బు రాబట్టుకుంటున్నాడు.

No comments:

Post a Comment

Post Top Ad