నటుడు చంద్రశేఖర్ కన్నుమూత

Telugu Lo Computer
0


రామాయణ్ సీరియల్ నటుడు చంద్రశేఖర్ వయసు రీత్యా  కన్నుమూసారు. ఈయనకు  98 ఏళ్లు. ఈయన ‘ఛ ఛ ఛ’ ‘సురాగ్’ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు తన నివాసంలో తుది శ్వాస విడిచినట్టు ఆయన తనయుడు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అశోక్ శేఖర్ మీడియాకు తెలియజేసారు. నిద్రలోనే కన్నమూసిన చంద్రశేఖర్ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. ఈయన అంత్యక్రియలు ముంబైలోని జుహు పవన్ హన్స్ శ్మశాన వాటికలో నిర్వహించారు. 1954లో ప్రముఖ దర్శకుడు శాంతారామ్ తెరకెక్కించిన ‘సురాగ్’తో వెండితెరకు పరిచమైన ఈయన స్వస్థలం హైదారాబాద్. సినిమాల్లో అవకాశాల కోసం ముంబై పయనమయ్యారు. అక్కడ జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు.

ఆ తర్వాత 1964లో ‘ఛ ఛ ఛ’ సినిమాతో నిర్మాతగా దర్శకుడిగా మారారు. ఈ సినిమాను  హెలెన్ ముఖ్యపాత్రలో తెరకెక్కించారు. 1987లో రామానంద్ సాగర్ తెరకెక్కించిన ‘రామాయణం’ సీరియల్‌లో దశరథుడి ప్రధాన మంత్రి సుమంత్రుడి వేషం వేసారు. మొత్తంగా బాలీవుడ్‌లో 250 పైగా చిత్రాల్లో పలు పాత్రల్లో అలరించారు. అంతేకాదు ఈయన ప్రముఖ దర్శకుడు, రచయత అయిన గుల్జార్ దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసారు. ఈయనకు ముగ్గురు కుమారులు. ఈయన మృతిపై బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)