జోకర్‌ మాల్‌వేర్‌తో జాగ్రత!

Telugu Lo Computer
0


ఇది చాలా ప్రమాదకరమైన మాల్‌వేర్‌ అని,  దీనికి అడ్డుకట్ట వేసేందుకు మూడేళ్లపాటు శ్రమించామని పోయినేడాది గూగుల్‌ ప్రకటించుకుంది. కానీ,  కిందటి ఏడాది జులైలో గూగుల్‌ ప్లే స్టోర్‌లో మళ్లీ జోకర్‌ కదలికలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన గూగుల్‌.. కొన్ని అనుమానాస్పద యాప్‌ల్ని ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. అయినప్పటికీ జోకర్‌ భయం పూర్తిగా తొలగిపోలేదు. ఇక ఇప్పుడు జోకర్‌ మాల్‌వేర్‌ గురించి ఫిర్యాదులు తమ దృష్టికి రావడంతో మహారాష్ట్ర పోలీసులు దేశవ్యాప్తంగా ఒక అలర్ట్‌ జారీ చేయడం విశేషం. 

* యాప్‌లకు(అవసరం లేనివాటికి) ఎస్సెమ్మెస్‌ యాక్సెస్‌ పర్మిషన్‌ను తొలగించాలి.

* అవసరం లేని సర్వీసులు, సబ్‌స్క్రిప్షన్‌ల నుంచి బయటకు వచ్చేయాలి. 

* ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను, నెట్‌బ్యాంకింగ్‌ సమాచారాన్ని ఫోన్‌లో దాచిపెట్టుకోకపోవడం మంచిది.

* క్రెడిట్‌ కార్డు బిల్లులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం.. తెలియకుండా జరిగిన కొనుగోళ్లపై దృష్టి సారించడం. 

* అనవసరమైన యాప్స్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోకపోవడం.

* రివ్యూల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

* ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే యాప్స్‌ అయినా సరే.. అనుమానంగా అనిపిస్తే తొలగించడం. 

* యాంటీ వైరస్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవడం‌. 



Post a Comment

0Comments

Post a Comment (0)