రేవ్‌ పార్టీలో పట్టుబడ్డ దక్షిణాది చిత్ర పరిశ్రమ యువతులు

Telugu Lo Computer
0

 

వైన్‌ కాపిటల్‌గా పేరొందిన నాసిక్‌లో జరిగే రేవ్‌ పార్టీపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి కొంతమందిని అరెస్టు చేశారు. వారిలో నలుగురు యువతులు దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందినవారిగా వారు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాసిక్‌ ఇగాత్‌పురిలోని స్కైతాజ్‌, స్కై లగూన్‌ అనే రెండు ఖరీదైన విల్లాల్లో రేవ్‌ పార్టీ నిర్వహించారన్న సమాచారం మేరకు పోలీసులుకు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే యువతీయువకులంతా.. మద్యం మత్తులో తూగుతున్నారు. వారి పక్కనే పెద్ద మొత్తంలో విదేశీ మద్యం సీసాలు, హుక్కాలు పడి ఉన్నాయి. ఈ రైడ్‌లో పోలీసులు 22 మందిని అరెస్టు చేశారు. వారిలో 10 మంది పురుషులు కాగా, 12 మంది స్త్రీలు వున్నారు. అయితే అరెస్టు చేసిన వారిలో ఓ మహిళ బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌. అలాగే దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన మోడల్స్‌, నటులు.. సహ కొరియోగ్రాఫర్లుగా ఉన్న నలుగురు యువతులు ఉన్నట్లు సమాచారం. నిందితులను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు.. వీరందరిపై నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ పార్టీ నిర్వహించడానికి సహాయపడిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)