* జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే !
* కంటికి ఇంపైతే నోటికీ ఇంపే !
* కంటికి రెప్ప కాలికి చెప్పు !
* కంపలో పడ్డ గొడ్డు వలె !
* కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా?
* క్రింద పడ్డా నాదే పైచేయి అన్నాడంట !
* కల్ల పసిడికి కాంతి మెండు !
* గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు !
* జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల !
* జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది !
* జన్మకో శివరాత్రి అన్నట్లు !
* జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు !
* జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి
* జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు !
* డబ్బు కోసం గడ్డి తినే రకం !
* డబ్బుకు లోకం దాసోహం !