ఎన్టీఆర్ - ఆభరణాల సేకరణ

Telugu Lo Computer
0


నందమూరి తారక రామారావు గారు పోషించిన పౌరాణిక పాత్రలకు సంబంధించిన దుస్తులు, గదలు, ఆభరణాలు, ఇత్యాదుల్ని సేకరించి భద్రపరిచారు.

ఈ ఆభరణాలను సేకరించాలనే ఆసక్తి రామారావు గారికి ఎందుకు కలిగింది?
ఆ విషయాన్ని రామారావు గారే ఒక్క సందర్భంలో వెల్లడించారు.1955లో అనుకుంటాను.జయసింహ చిత్రంలోని ఒక సన్నివేశంలో నేను అర్జునుని పాత్రలో కనిపిస్తాను.నా పౌరాణిక పాత్రలకు అది తొలిమెట్టు అని చెప్పాలి.ఎందుకంటే ఆ పాత్ర ధరించిన తర్వాతే పూర్తిస్థాయి పౌరాణిక చిత్రం చేయాలనే కోరిక నాలో కలిగింది.
ఆ తర్వాతికాలంలో అది నెరవేరిందనుకోండి.పౌరాణిక పాత్రలు ధరించి కాస్త గుర్తింపు వచ్చాక వాటిపై స్పెషలైజ్ చేయాలనే ఆలోచన కలిగింది.అదే నా పరిశోధనకు నాంది పలికింది. ఆనాటి నుంచి నేటిదాకా ఎంతోమంది కళా దర్శకులు అద్భుతంగా రూపొందించిన ఆభరణాలను,కిరీటాలను భద్రపరుస్తున్నాను. కొన్నింటిని నేనే భావంచెప్పి రూపొందింపచేశాను.
ఇవన్నీ నేను సేకరించి జాగ్రత్త చేయక పోయినట్లయితే నాకు కావలసిన పాత్రకు తగిన ఆభర ణాలు ఎక్కడ దొరుకుతాయి? ఒకవేళ దొరికినా అవి నా అభిరుచుల మేరకు ఉంటాయనే నమ్మకం ఎక్కడుంది? అందుకే వీటిని పదిలపరిచాను. వీటన్నింటినీకంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను.
ఒక్కోసారి వీటిని చూస్తున్నప్పుడు ఒక్కో కిరీటం,ఒక్కోగద నాలోని కళాకారుణ్ణి తట్టి లేపుతుంది. తన్మయుణ్ణి చేస్తుంది. ఖరీదు కట్టలేని ఈ అపురూప ఆభరణాలను చూస్తుంటే ఆనాటి పౌరాణిక వైభవం,ఒక్కసారి కళ్లలో అలా కదలా డుతుంది అని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)