డెల్టా ప్లస్ తో థర్డ్ వేవ్ ముప్పు !

Telugu Lo Computer
0


రాష్ట్రంలో డెల్టాప్లస్ వేరియంట్‌  థర్డ్ వేవ్ పొంచి ఉందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.  ఒకవేళ  ఆదే జరిగితే సెకండ్ వేవ్కు రెట్టింపు సంఖ్యలో కేసులు వస్తాయని మహారాష్ట్ర కోవిద్-19 టాస్క్ ఫోర్స్, వైద్య నిపుణుల బృందం హెచ్చరిస్తున్నారు.  నిర్లక్ష్యం వహిస్తే యాక్టివ్ కేసులు తిరిగి 8లక్షలకు చేరతాయని, అందులో పదిశాతం చిన్నారులే ఉంటారంటూ  ఆరోగ్యశాఖ, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో జరిగిన సమావేశంలో హెచ్చరించింది. థర్డ్‌వేవ్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నరాష్ట్రం అందుకు సన్నాహక కార్యక్రమాలు చేపట్టగా, రాష్ట్ర టాస్క్ ఫోర్స్‌తో మంత్రి రాజేష్ తోపే సమావేశం కాగా, ముఖ్యమంత్రి  ఉద్దవ్ ఠాక్రే వారికి అవసరమైన చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు.  లిక్విడ్ ఆక్సిజన్, మెడిసిన్స్, ఎక్విప్‌మెంట్ అన్ని  ప్రాంతాలలో  అందుబాటులో ఉంచాలని ఇందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ చర్యలకు ఉపక్రమిస్తూనే, టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, అలానే భౌతికదూరం పాటించాల్సిందిగా ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలని కోరారు 

మహారాష్ట్రలో ఫస్ట్ వేవ్ సందర్భంగా 19లక్షలమంది కరోనా బారిన పడ్డారు. అలానే సెకండ్ వేవ్ సందర్భంగా 40లక్షలమందికి వైరస్ సోకగా, ప్రస్తుతం థర్డ్ వేవ్ వస్తే ఎలాంటి ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయంపై అంచనాలు ప్రారంభించింది. ఇప్పుడు కొత్తగా భయపెడుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ గురించి  భయాలు అనవసరమని, ఎందుకంటే ఇది వ్యాపిస్తున్న దాఖలాలు లేవని కేంద్ర ఆరోగ్యశాఖే చెప్పింది. ఐతే ఏదెప్పుడు ఎలా విస్తరిస్తుందో ఊహించలేం. ఇలా  జాగ్రత్తలు గాలికి వదిలేయబట్టే సెకండ్ వేవ్ విషయంలో దేశమంతా దెబ్బ తిన్నది..మరో వేవ్‌ని భరించే స్థితిలో మనం  లేం..అందుకే టీకా వేయించుకుని జాగ్రత్త పడాల్సిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)