* విస్తరి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది !
* శృతి ముదిరి రాగాన పడింది !
* శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ అన్నాడట !
* శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు !
* శతకోటి లింగాలలో బోడిలింగం ఒకటి !
* శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయంట !
* శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు !
* శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది !
* శెనగలు తింటూ ఉలవలని చెప్పి పత్తివిత్తులు చేతిలో పెట్టినట్లు !
* శొంఠి లేని కషాయం లేదు !
* నివురు గప్పిన నిప్పులా !
* నీటిలో రాతలు రాసినట్లు !
* నీ వేలు నా నోట్లో, నా వేలు నీ కంట్లో !
* నీతిలేని పొరుగు నిప్పుతో సమానం !
* నీపప్పూ నా పొట్టూ కలిపి వూదుకు తిందామన్నట్లు