పంజరంలేని పక్షి!

Telugu Lo Computer
0

 

    జైలు నుంచి విడుదలై వచ్చాడు కిట్టయ్య ,అంతా మూగారు. "నాయనా వచ్చావురా, అన్నాఅంటూ చెల్లి. వచ్చావా నీకోసం ఎంత దిగులు పడ్డాం ఎన్ని కష్టాలు పడ్డావో బిడ్డ జైల్లో."  

    "ఏదో ఆవేశం లో చేసిన తప్పు ఎన్నాళ్ళు నిన్నుా మమ్మల్ని కూడా క్షోభకు గురిచేసింది. చాలురా నాయనా,ఈ చెడ్డ స్నేహాలు మానెయ్యి.తప్పుచేసింది ఒకరైన అందరికి శిక్షగదా! "తల్లిదండ్రులు.

   " బాగున్నానమ్మా నాయన మీరు ఎట్ల ఉన్నారు, జనవరి 26 కదా నా నడత బాగుందని  ఇడిసిపెట్టి నారమ్మా."

    అమ్మ "నాయనా తానంఆడిరా నాలుగు మెతుకులు నోటబెట్టుకొని కాస్త ఇశ్రాంతి తీసుకో."

    కిట్టు గాడు సాయంత్రం ఇంటి ముందు యాప చెట్టు కింద గట్టుమీద చెరాడు.ఆళ్ళు ఈళ్ళు పరామర్శకి వచ్చారు .ఏరా శాన తొందరగా వచ్చేసినావు.బుద్దిగా వుండురా ఇకనైనా.

   కానీ ఇక్కడ ఉంటేగా కిట్టిగాడి మనసు.జైలుమీద కెళ్ళింది.తోటివాళ్ళు,శాము,కిశోరు, సారులు.అంతాకళ్ళముందు కదిలింది....

    ఎంత బాగా చూసుకున్నారు సార్లు అక్కడ జైలు గోడలు లేవు. తలుపుల్లేవు బంధనాల్లేవు తాళాల్లేవు అసలు గోడలే లేవు .

    అందరికీ పెద్ద హాల్లో వుండడానికి హాస్టల్లా ఉంది నెలకు ఇంతని డబ్బులు ఇస్తారు. యోగ,చదువులు,ప్రార్ధనలు మొక్కల పెంపకం,మార్కెట్టు కెళ్ళడం అన్నీ సొంతంగా చేసుకోవడమే.సినిమాలు,యోగా క్లాసులు అలా.

     అంతే నువ్వు ఎక్కడైనా ఏదైనా చెయ్ కానీ సాయంత్రానికి ఏడుకల్లా లోపలకి రావాలి. ..,

    అందరూ కలిసి వంట వడ్డన అంతా వాళ్లే     కొందరైతే భార్య పిల్లలు తెచ్చుకుని చిన్నక్వార్టర్లలో  ఉంటున్నారు .ఎవరు నిర్బంధించరు .

      న్యాయం చట్టానికి చేతులు పెద్దవి అని అందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్తారు ....    

   కట్టు కొయ్యని కట్టిన పలుపు తాడు తీసేసినా ఎటూ వెళ్ళదు పశువు.వెళ్ళినా తెచ్చి బంధిస్తారుగదా.  అదే విధంగా బందీలుకూడా ఎక్కడికి వెళ్లరు .

   "అమ్మా ఇదిగో  నీకు సీరా నానకు బట్టలు సెల్లికి పుస్తకాలు తెచ్చాను.బడికి పంపుదాం. " "డబ్బులు ఎక్కడయిరా నాన్నా".    "నా కష్టమే అమ్మ జైలులో జీతం లాగిస్తారు అందులో మిగిల్చా.

    నేను అక్కడ బియేదాక చదువుకున్నానమ్మ.  ఈ డబ్బుతో వ్యాపారం పెట్టుకుందాం గేదేలు కొందాం. పాలయాపారం జేసుకుందాం."అట్టాగే లేరా నాయనా మన బతుకులు ఒడ్డునబడతయి.

    "నువ్వింటి పట్టునుంటే అదే పదేలు.

 బాగుపడతా మంటే అందరికి సంతోసమేగదా. అదే సంతృప్తి.

    అస్తమాన సూరీడు రేపు కలుద్దామంటూ పడమటి కొండల్లోకి జేరాడు.

  కొన్ని జైళ్ళల్లో ఇలాఖైదీలను స్వేచ్ఛగ బంధిస్తున్నారట!.

Post a Comment

0Comments

Post a Comment (0)