కొత్త రకాలు దరి చేరవు

Telugu Lo Computer
0


అమెరికాలోని రాక్ ఫెల్లర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కరోనాతో కోలుకున్న వారికి టీకాతో అదనపు బలం చేకూరుతుందని తమ పరిశోధనలో కనుగొన్నారు. బాధితులలో యాంటీబాడీ ఉనికిని విశ్లేషించిన తరువాత కూడా వాటి తీరుతెన్నులను గమనించారు. కొంత కాలం తరువాత రోగ నిరోధక వ్యవస్థలోని మమెరీ బి కణాలు కోవిడ్ కారక సార్స్ -కోవ్-2 వైరస్ ను సమర్ధంతంగా ఎదుర్కొనేలా రూపాంతరం చెందాయని తేల్చారు. మమెరీ బి కణాలు రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన రిజర్వ్ యర్ లా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. దానిలో భిన్నరకాల యాంటీబాడీ ఉంటున్నాయంటు న్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు ఒక డోసు టీకా తీసుకున్నా యాంటీబాడీలు మరింత ఎక్కువగా పెరిగాయని చెప్పారు. అందువల్ల కొత్త రకాలు దరి చేరవని  చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)