బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసా?

Telugu Lo Computer
0


ఇటీవలి కాలంలో ఒత్తిడినెదుర్కొంటున్న బంగారం ధరలు మూడు నెలల కనిష్టానికి చేరాయి. బుధవారం నాటి మార్కెట్‌లో పసిడి ఫ్లాట్‌గా కొనసాగుతున్నప్పటికీ 2016 తరువాత భారీగా ధర పడిపోయిన నెల ఇదేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నెలలో 10గ్రాముల బంగారం ధర 7.6 శాతం క్షీణించగా, ఈ త్రైమాసికంలో 3.2 శాతం ఎగిసింది. గత ఏడాది రూ. 56200 గరిష్టం నుంచి 10వేల రూపాయలు పడిపోయింది. ఇక ఈ నెలలోనే 2,700 రూపాయలు దిగి వచ్చింది. రీటైల్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46770గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45180గా ఉంది. ఇక దేశీయంగా వెండి ధర కిలో 67747 పలుకుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)