వందేళ్ల క్రితం ప్రకటనల రూపం !

Telugu Lo Computer
0


మన జీవనంలో తేళ్లు ఎంత ప్రాణాపాయ పాత్ర పోషించాయో చెప్పడానికి ఈ వ్యాపార ప్రకటనలు ఉదాహరణ. తేలు కుడితే వాడే మందులను తయారుచేసే సంస్థల ప్రకటనలు ఇవి. 1918 ఆంధ్రపత్రిక వార్షిక సంచికలో వచ్చినవి.ఈ ప్రకటనల్లో గమనించవలసిన ఆకర్షణీయమైన అంశం ఒకటి వుంది.తేలుమందు ప్యాకెట్టు ధర ఎనిమిది అణాలు అయితే, మా మందు పనిచేయలేదని నిరూపించిన వారికి 100 రూపాయలు బహుమతి ఇస్తామని ఆ సంస్థలు ఛాలెంజ్ విసరడం.మరొక ఆసక్తికరమైన అంశం.. తమ వ్యాపార ప్రకటనలను పద్యాల రూపంలో రూపొందించడం. సీసపద్యాలు, తేటగీతి పద్యాలు, శార్దూల పద్యాలు.. భలే గమ్మత్తయిన వాణిజ్య ప్రకటనలు.

Post a Comment

0Comments

Post a Comment (0)