సామెతలు.....!

Telugu Lo Computer
0

 

* ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు !

* ఈడు చూసి పిల్లని యివ్వాలి – పిడి చూసి కొడవలి కొనాలి !

* ఈటె పోటు మానుతుంది గానీ మాట పోటు మానదు !

* ఉంటే అమీరు – లేకుంటే పకీరు !

* ఉండమనలేక వూదర, పొమ్మనలేక పొగ పెత్తినట్లు !

* ఉండి చూడు వూరి అందం – నానాటికీ చూడు నా అందం అన్నట్లు !

* ఊకని దంపితే బియ్యం వస్తాయా?

* ఊగే పంటి కింద రాయి పడ్డట్టు !

* ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు !

* ఊపిరి పోతూంటే ముక్కులు మూసినట్లు !

* ఊరంతా ఉత్తరం వైపు చూస్తే అక్కుపక్షి దక్షిణం వైపు చూస్తుందిట !

* ఊరంతా చుట్టాలే వుట్టి కట్టుకోను చోటు లేదు !

* ఋణ శేషము శత్రు శేషము వుండ కూడ దంటారు !

* ఋణము – వ్రణము ఒక్కటే !

* ఎంగిలాకులు ఎత్తమంటే లెక్క పెట్టినట్లు !

Post a Comment

0Comments

Post a Comment (0)