తిథిప్రదీపికా!

Telugu Lo Computer
0

 

చెట్టు ముందా ? విత్తుముందా? అని అడిగితే ఎలాగైతే చెప్పలేమో తెలుగు భాష ప్రాచీనత కూడ ఇలాగే.. మన రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ఎలా కుంచించుకు పోతున్నదో మనమే సాక్షులం…
పర భాషలో ప్రావీణ్యం సాధించటం మంచిదే కాని మన భాషను మరిచి పోకూడదు…
నాకు మా నాన్నగారి పాత పుస్తకాలలో 450 నాలుగు వందల యాభై సంవత్సరాల క్రిందటి చిన్న వ్రాతప్రతుల పుస్తకం దొరికింది.ఆ పుస్తకంపేరు తిథిప్రదీపికా .. ఆ వ్రాసిన మహానుభావుడు సామాన్యుడు కాడు. భట్టూజీ దీక్షితులు అని పాణిని సంస్కృత వ్యాకరణాన్ని లఘసిద్ధాన్త కౌమూది గా ప్రాచుర్యంలో తెచ్చారు.. ఈయన కాశీ పండితులు.. వీరి పూర్వులు తెలుగు ప్రాంతమునుండి వలస వెళ్లారు .ఈయన అక్బర్, జహంగీరు కాలము వారు. (1550 — 1630).

ఈయన మీద స్విట్జర్లాండు ప్రొఫెసర్ బ్రాంక్ హార్స్ట్ గారు పరిశోధన సల్పి ఈయన తెలుగు వారు అని అభిప్రాయానికి వచ్చారు…. వారి తండ్రి గారి పేరు లక్ష్మీధర సూరి అని వ్రాసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)