* ఋణము – వ్రణము ఒక్కటే !
* ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు !
* ఎంగిలాకులు ఎత్తమంటే లెక్క పెట్టినట్లు !
* ఎంగిలికి ఎగ్గు లేదు – తాగుబోతుకు సిగ్గు లేదు !
* ఎంచపోతే మంచమంతా కంతలే !
* ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు !
* ఏ ఎండకా గొడుగు!
* ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడు !
* ఒక దెబ్బకు రెండు పిట్టలు !
* ఒడిలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు !
* ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య !
* ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి !
* కంచానికి ఒక్కడు – మంచానికి ఇద్దరు !
* కంచి లో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్లు !
* కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? !