పద్మనాభం యుద్ధం

Telugu Lo Computer
0


మన దేశం లో బ్రిటిష్ పాలన మొదలయ్యేటప్పటికి విజయనగరం గంజాం, విశాఖపట్టణం, శ్రీకాకుళం ప్రాంతాలు 20 మంది జమీందారుల అధీనంలో వుండేవి. 
వివిధ కారణాలవల్ల ఈ జమీందారులు ఆగ్లేయులకు 

వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆంగ్లేయులకేమో సాధ్యమైనంత తీరప్రాంతం తమ గుప్పిట్లో వుండాలన్నపట్టుదల. ఆ ప్రయత్నంలోనే విజయనగరం జమీన్దారీని ఆక్రమించు కోవాలనుకున్నారు. యింతలో విజయనగరం అధిపతి ఆనందగజపతిరాజు మరణించడంతో దానికి అవకాశం వచ్చింది. అప్పటికి ఆయన కొడుకు చిన విజయరామరాజుది చిన్న వయసు. అందుకని ఆనందగజపతిరాజు సవతి సోదరుడైన 

సీతారామరాజును దివానుగా నియమించారు.విజయరామరాజు రాజు కాగానే సీతారామరాజును దివాన్ పదవి నుండి తొలగించారు, దాంతో సీతారామరాజు ఆంగ్లేయులతో జట్టు కట్టాడు. అవకాశం చూసుకొని 

ఆంగ్లేయులు తమకు చెల్లించాల్సిన ఎనిమిదిన్నర లక్షల పెష్కస్ చెల్లించాలని లేకపోతే జమీన్దారీని ముట్టడిస్తామని విజయరామరాజును హెచ్చరించారు. రాజు దానికి ఒప్పుకోక పోవడం తో 1793 ఆగస్ట్ 2వ తేదీన విజయనగరం కోటను ఆక్రమించుకున్నారు.ఆగ్లేయులు రాజుకు నెలకు 1200 రూపాయలు యిస్తామనీ,మచిలీపట్నం వెళ్లాల్సిందిగా ఆదేశించారు.తిరస్కరించిన రాజు విశాఖపట్టణం జిల్లా లోని 

పద్మనాభం చేరుకున్నాడు. అక్కడ కొంత సైన్యం సమకూర్చుకొని ఆంగ్లేయుల మీద యుద్ద్ధం ప్రకటించాడు. జులై 10 1794 నాడు జరిగిన ఆ యుద్ధం లో విజయరామరాజు మరణించాడు.విజయనగరం ఆంగ్లేయుల చేతిలోకి వచ్చింది.చరిత్ర లో యిదే 'పద్మనాభయుద్ధం' గా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ వున్న పద్మనాభస్వామి దేవాలయం కళింగ నిర్మాణ శైలిలో అలరారుతుంటుంది.




Post a Comment

0Comments

Post a Comment (0)