చైనాలో కొత్త రకం బర్డ్ ఫ్లూ !

Telugu Lo Computer
0

చైనా తూర్పు జయాంగ్సు ప్రావిన్స్ నుండి హెచ్ 10 ఎన్ 3 బర్డ్ ఫ్లూ ఒక మనిషికి సోకినట్లుగా గుర్తించారు. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. జెంజియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకిందని నిర్ధారించారు. అతను ప్రస్తుతం బాగానే ఉన్నాడనీ, అతనికి వైద్య సహాయం అందుతోందనీ చైనా ప్రభుత్వ సిజిటిఎన్ టివి తెలిపింది. ఇటువంటి బర్డ్ ఫ్లూ అప్పుడపుడు పౌల్ట్రీల నుంచి మానవులకు సంక్రమిస్తుందని అక్కడి ఆరోగ్య అధికారులు చెప్పారు. అదేవిధంగా ఇది వేగంగా విస్తరించే అవకాశం లేదన్నారు. మహమ్మారిలా ఇది విరుచుకుపడే ప్రమాదం చాలా తక్కువ అని వారు తెలిపారు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కేసులో రోగికి మే 28 న హెచ్ 10 ఎన్ 3 ఏవియన్ ఇంఫ్లుఎంజా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, జాతీయ ఆరోగ్య కమిషన్ ఒక వ్యక్తికి వైరస్ సోకినట్లు వివరిస్తూ ఒక ప్రకటన చేసింది.

ఇప్పటివరకూ హెచ్ 10 ఎన్ 3 తో ​మానవ సంక్రమణకు సంబంధించిన ఇతర కేసులు ఇంతకుముందు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా నమోదు కాలేదు. H10N3 అనేది పౌల్ట్రీలో వైరస్ యొక్క తక్కువ వ్యాధికారక లేదా తక్కువ తీవ్రమైన జాతిగా అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఇది పెద్ద ఎత్తున వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువ. చైనాలో ఏవియన్ ఇంఫ్లుఎంజా యొక్క అనేక జాతులు ఉన్నాయి. వాటిలో కొన్ని అరుదుగా ప్రజలకు సోకుతాయి, సాధారణంగా పౌల్ట్రీతో పనిచేసేవారు వీటిబారిన పడే అవకాశం ఉంటుంది. H5N8 అనేది ఇంఫ్లుఎంజా A వైరస్ యొక్క ఉప రకం (దీనిని బర్డ్ ఫ్లూ వైరస్ అని కూడా పిలుస్తారు). H5N8 మానవులకు తక్కువ ప్రమాదాన్ని మాత్రమే కలిగిస్తుంది. ఇది అడవి పక్షులు అలాగే పౌల్ట్రీలకు చాలా ప్రాణాంతకంగా చెబుతారు.

Post a Comment

0Comments

Post a Comment (0)