చేయాల్సినవి - చేయకూడనవి !

Telugu Lo Computer
0

 


*  అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి..

*  ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి... 

*  నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవునేతి దీపం పెట్టాలి, 

* శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు  తెలుపు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి.

*  దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుకభాగం (బలిపీఠం దగ్గర తాకడం కానీ తల అనించడం కానీ చేయకూడదు.

*  బలిపీటాల దగ్గర అర్చకులు తప్ప ఎవరూ ఏది అక్కడ పెట్ట కూడదు.. 

గుడిలో దేవుడికి, అర్చకులకు తప్ప ఎవరికీ  నమస్కారాలు చేయకూడదు.

*  నవగ్రహాలు తాకి మొక్క కూడదు...

*  షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు, 

* రాత్రి పూట తల చిక్కు తీయకూడదు, 

* పెరుగు చేతితో చిలక కూడదు, 

*  నీరు, పాలు, పెరుగు,  నెయ్యి కి అంటు ఉండదు.

అవి ఎక్కడ నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు..

*  లక్ష్మీ దేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి, 

* లక్ష్మీ దేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి.. 

* అలాగే జేష్ఠ దేవి అనుగ్రహం ఎలా పొందాలి 

* జేష్ఠ దేవి నివాసం పులిహోర ,జేష్ఠ దేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి.. 

* పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జేష్ఠా దేవి పెట్టె కష్టాలనుండి ఉపశమనం లభిస్తుంది, 

* పులిహోర చేసి పంచి పెడితే జేష్ఠా దేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునే వాళ్ళు...పంచి పెడితే ఇంకా మంచిది.

*  రాత్రి పూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు, ఆహారం రుచిగా లేకపోయినా బాగలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటూ..వంట చేయకూడదు. తినే వారు కూడా తిట్టుకుంటూ తింటారు.. సంతోషం గా వంట చేస్తే సంతోషం గా తింటారు...

* ఎప్పుడూ నిద్రపోతూ ఉండే వాడు, 

అసలు నిద్రపోకుండా ఉండే వాళ్ళు, 

ఎప్పుడూ తింటూనే ఉండే వారు, 

అసలు ఆహారం పైన శ్రద్ద లేకుండా పస్థులు ఉపవాసాలు ఉండే వారు, 

ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధార పడి 

బతికే వాళ్ళు, పంచమహా పాతకం చేసిన వారి కన్నా 

పెద్ద పాపాత్ములు..

* పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు,  కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు..

* ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చో కూడదు, నిలువుగా ఉండాలి. 

జపమాల చూపుడు వెలుపైన తిప్ప కూడదు  మధ్య వేలు తోనే చేయాలి..

*  జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు, మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు..

*  ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించ కూడదు....

* దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళు దగ్గరకు ,పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్లకూడదు...

*  ఇంట్లో అతిధి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు... 

* మొదటి సారి ఎవరైనా ఇంటికి భోజనంకి వచ్చినప్పుడు వారుఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండవ సారి కాస్త అయినా పెట్టుకోవాలి. అలా ఒక్కసారి లేస్తే ఆతిధ్యం ఇచ్చిన ఫలితం దక్కదు..

* ఇంట్లో పిల్లలు ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి, అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒకసారి ఆ నామం మనసులో తలచుకోవడం అలవాటు అవుతుంది.

* అద్దె ఇల్లు వాస్తు మీ జాతకానికి సరిపడక పోవచ్చు అలాంటి వాస్తు దోషాలు పరిహారం గా ఏడు రంగులు కలిసిన వాల్ మెట్ గోడకు డెకరేషన్ గా పెట్టాలి....

*  ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి. నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.. ఇంట్లో గాలి శుభ్రం  అవుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)