* జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లు !
* కంచం అమ్మి మెట్టెలు కొన్నట్టు !
* క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు !
* క్షణమొక యుగంలా !
* చంద్రునికో నూలుపోగు !
* చక్కనమ్మ చిక్కినా అందమే !
* జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది !
* జరుగుబాటు తక్కువ – అదిరిపాటెక్కువ !
* జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు !
* జాతి నాగులను చంపుతూ ప్రతిమ నాగులకు పాలు పోసినట్లు !
* డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు !
* డబ్బు కోసం గడ్డి తినే రకం !
* డబ్బు ఉంటే కొండమీది కోతి కూడా దిగి వస్తుంది !
* తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓరుస్తుంది !
* తండ్రి చస్తే పెత్తనం తెలుస్తుంది – తల్లి చస్తే కాపురం తెలుస్తుంది !