సిద్ధిక్ కప్పన్పై కేసు కొట్టివేత

Telugu Lo Computer
0



హత్రాస్‌ హత్యాచార ఘటనను కవర్‌ చేసేందుకు వెళ్లిన కేరళ జర్నలిస్టు సిద్దిక్‌ కప్పన్‌, ఇతరులపై నమోదైన ఆరోపణలను ఉత్తరప్రదేశ్‌లోని మధుర కోర్టు తీసివేసింది (డ్రాప్ చేసింది). ఆరోపణలను రుజువు చేయడంలో పోలీసులకిచ్చిన ఆరు నెలల వ్యవధిలో అభియోగాలు నమోదు చేయడంలో విఫలమైనందున అభియోగాలను డ్రాప్ చేసినట్లు డిఫెన్స్‌ న్యాయవాది మధుబన్‌ దత్‌ చతుర్వేది తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో యుపిలోని హత్రాస్‌ అత్యాచార ఘటన తర్వాతి పరిణామాలను చిత్రీకరించేందుకు వెళ్లిన కప్పన్‌, ఆలమ్‌, మసూద్‌, అతికుర్రహ్మన్‌ యుపి పోలీసులు రాడికల్‌ గ్రూప్‌... పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాతో సంబంధాలున్నాయని అభియోగం మోపి .. అరెస్టు చేసిన సంగతి విదితమే. శాంతి విఘాతం కలిగించే అవకాశాలున్నాయన్న పేరుతో అదుపులోకి తీసుకున్నప్పటికీ... తర్వాత దేశద్రోహం, ఉగ్రవాద నిరోధక చట్టం యుపిఎపి, సమాచార సాంకేతిక చట్టం కింద కేసులు బనాయించారు. వీరిపై దర్యాప్తు చేపట్టేందుకు పరిమితి గడువు ముగిసినందున, నలుగురు నిందితులపై ఆరోపణలను కోర్టు కొట్టి వేసింది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)