పటాన్ చెరులో కానిస్టేబుల్పై దాడి

Telugu Lo Computer
0

 

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సివిల్ దుస్తుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్‌ను నలుగురు దుండగులు కలిసి అతి దారుణంగా కొట్టారు. పటాన్ చెరు నోవాపాన్ కూడలిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పటాన్ చెరు నోవా పాన్ కూడలిలో ఓ కేసు విషయంలో దేవీలాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి బాచుపల్లి కానిస్టేబుల్ కనకయ్య వెళ్లాడు. దేవీ లాల్‌ను అదుపులోకి తీసుకునేందుకు వెళ్ళిన సమయంలో నలుగురు వ్యక్తులు కలిసి ఒక్కసారిగా కానిస్టేబుల్ కనకయ్యపై దాడికి పాల్పడ్డారు. పోలీస్ అని చెప్పినా కూడా ఐడీ కార్డ్, సెల్ ఫోన్ విసిరికొట్టి కానిస్టేబుల్‌పై దాడి చేశారు. చెప్పులతో, కర్రలతో కొడుతూ అతి దారుణంగా హింసించారు. ఈ దాడిలో కానిస్టేబుల్ కనకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసుల కధనం ప్రకారం .... మారుతీ ప్రసాద్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రసాద్ కొత్త ఇంటిని నిర్మించుకొని గృహాలంకరణకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను ఐదు లక్షల రూపాయలకు దేవీలాల్‌తో ఒప్పందం చేసుకున్నాడు. దీంతో కొంత మొత్తం అడ్వాన్స్‌గా దేవీలాల్‌కు ప్రసాద్ ఇచ్చాడు. దేవీలాల్ పని చేయకుండా తిరుగుతున్నాడు. అతడి ఆచూకీ లభించకపోవడంతో కోర్టు ద్వారా దేవీలాల్‌పై ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేసిన ఎంత వెతికినా అతడు దొరకలేదు. దేవీలాల్ ఉన్న ప్రదేశానికి కానిస్టేబుల్ కనకయ్యను ప్రసాద్ తీసుకెళ్లాడు. దేవీలాల్ నోటీసు ఇచ్చి సంతకం చేయాలని కోరగా అతడి అనుచరులు కానిస్టేబుల్‌పై దాడి చేశారు. కానిస్టేబుల్ వారి నుంచి తప్పించుకొని పటాన్ చెరు  పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దేవీలాల్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)