ఘంటసాల రత్నకుమార్‌ కన్నుమూత

Telugu Lo Computer
0

 

ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్‌ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.   చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కొన్నిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకుంటున్న రత్నాకర్ ఈరోజు కన్నుమూశారు.  కరోనా సోకి కోలుకున్న రత్నకుమార్ కొన్ని రోజులుగా డయాలసిస్‌ చేయించుకుంటూ ఉండగా హార్ట్ ఎటాక్‌ రావడంతో చనిపోయారు.

ఘంటసాల రత్నకుమార్‌ చిత్ర పరిశ్రమలో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. తమిళ స్టార్ హీరోలకు సైతం రత్నకుమార్ తెలుగులో డబ్బింగ్ చెప్పేవారు. రత్నకుమార్‌ ఏకకాలంలో ఎనిమిది గంటలపాటు డబ్బింగ్‌ చెప్పి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లోకి ఎక్కారు. అమేజింగ్‌ వరల్డ్ రికార్డ్ కూడా కైవసం చేసుకున్నారు. తమిళనాడు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్ కూడా సృష్టించారు. మొత్తం 1076 తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, సంస్కృతం సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు. పదివేల తెలుగు, తమిళ సీరియల్స్‌కి గాత్ర దానం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)