25 కోట్ల ఉచిత టీకాల సరఫరా!

Telugu Lo Computer
0


రానున్న మూడు రోజుల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మరో 3లక్షలపైగా టీకాలు పంపించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉచితంగా 25 కోట్ల వ్యాక్సిన్లు అందజేసినట్లు బుధవారం తెలిపింది.  ప్రస్తుతం 1.3కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని,  మే1న వ్యాక్సినేషన్‌ మూడో దశ   ప్రారంభం కాగా, జూన్‌ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కేంద్రమే ఉచితంగా టీకా ఇవ్వనుందని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.  మొత్తం ఉత్పత్తిలో 75 శాతం కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు.  టీకాల కోసం రాష్ట్రాలు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రధాని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)