‘మా’ భవనానికి రూ: 1.50 కోట్లు ఇస్తా

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల  సమావేశంలో ఒ.కల్యాణ్‌ మాట్లాడుతూ పదిహేనేళ్లుగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేన్‌ (మా)లో అలజడి తప్ప అభివృద్ధి లేదు అన్నారు. సభ్యులకి సేవ చేసే దారిలో ‘మా’ ప్రయాణం సాగడం లేదని, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా పెద్దలు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. నేను ఆరుసార్లు పోటీ చేసి ఓడిపోయాను. ప్రతిసారీ ఒక వర్గానికి మద్దతిస్తూ గెలిపిస్తున్నవాళ్లు ఎన్నికలు పూర్తవ్వగానే తప్పించుకుంటున్నారు. పాతికేళ్లుగా మా భవనాన్ని ఎందుకు నిర్మించడం లేదో చెప్పాలి. ‘మా’ కోసం అప్పట్లో ప్రభుత్వం వెయ్యి గజాల స్థలం ఇచ్చినా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడున్న సినీ పెద్దలకి వెయ్యి గజాల స్థలం కొనుగోలు చేసే శక్తి లేదా? అని ప్రశ్నించారు.  ‘మా’ భవనం కోసం తన ఆస్తులమ్మి రూ.1.50 కోట్లు ఇస్తానని ఆయన ప్రకటించారు. ఎన్నికల ప్రకటన రాకుండానే ప్యానెల్‌ ఏర్పాటు చేయడం తప్పని, ఈసారి తాను ఏ పదవికీ పోటీ చేయననీ, ఎవ్వరికీ మద్దతు ఇవ్వనన్నారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)