నా భార్య కనిపించడం లేదు...!

Telugu Lo Computer
0


కోల్ కతాకు చెందిన బి.నారాయణ దాస్, మోనికా దాస్ దంపతులు  యూసుఫ్ గూడ సమీపంలోని వెంకటగిరిలో నివాసం ఉంటున్నారు. నారాయణ దాస్ ప్లంబర్ గా పనిచేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గత కొంతకాలంగా ఫోన్ లో ఎండీ ఆసీఫ్ తో భార్య తరచూ మాట్లాడుతుండడం నారాయణ దాస్ గమనించాడు. దీంతో అతను భార్యను మందలించాడు. 

ఇదిలా ఉంటే ఈనెల 24వ తేదీన భర్త ఇంట్లో లేని సమయంలో మోనికా దాస్ తన ఇద్దరు పిల్లలను తీసుకుని కోల్ కతాకు వెళ్లిపోయింది. ఆసిఫ్ తో కలిసి వెళ్లినట్లు పిల్లలను తల్లి దగ్గర వదిలేసి వెళ్లినట్లు భర్త నారాయణ దాస్ తెలుసుకున్నాడు. ఆదివారం జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో తన భర్త కనిపంచడం లేదంటూ ఆసిఫ్ భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)