* ఆరోగ్యమే మహాభాగ్యము
* మోసే వాడికి తెల్సు కావడి బరువు
* ఇల్లలకగానే పండగ కాదు
* ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరగక చెడతాడు
* ఊళ్ళో పెళ్ళి కి కుక్కల హడావిడి
* చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
* అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
* అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
* ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
* కోటి విద్యలూ కూటి కొరకే
* కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
* ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
* ఆది లొనే హంస పాదు
* విద్య లేని వాడు వింత పశువు
* అగ్నికి వాయువు తోడైనట్లు