చిన్న పిల్లలలో తీవ్ర లక్షణాలుండవు

Telugu Lo Computer
0

 

చిన్న పిల్లలకు కరోనా సోకినా వారిలో తీవ్ర లక్షణాలు  వుండవని, అయితే వైరస్ స్వభావాన్ని మార్చుకుంటే దాని ప్రభావం ఎక్కువగా వుంటుందని, దానిపై కన్నేసి వుంచాలని, తామిప్పుడు అదే పనిలో ఉన్నామని   నీతి ఆయోగ్ సభ్యులు వీకే  పాల్  అన్నారు. 

పసి పిల్లలకు వైరస్ సోకినా ఎలాంటి లక్షణాలు కనిపించవు. వయసు పెరిగే కొలది లక్షణాలు పెరుగుతూ వుంటాయి. తక్కువ వయసు ఉన్న వారికి వైరస్ సోకినా, సోకినట్లు తెలియదు. వయసు తగ్గే కొద్దీ లక్షణాలు తక్కువవుతుంటాయి. డిసెంబర్లో జరిపిన సర్వే ప్రకారం పెద్దలలో ఎంత వరకు జీరో పాజిటివిటీ రేటు కనిపించిందో 10 సంవత్సరాలలోపు పిల్లలలో కూడా అంతే కనిపించింది. పిల్లలపై కొవాగ్జిన్ టీకా ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడానికి అనుమతించాము. 10-15 రోజుల్లో ఈ ప్రయోగాలు ప్రారంభమవుతాయని వీకే  పాల్ అన్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)