తొందరపాటు!

Telugu Lo Computer
0

 


😌మా పక్క ఇంటి ఆయన వచ్చి బైక్ అడిగాడు.
''హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ రిపోర్ట్ తీసుకుని వస్తాను!'' అన్నాడు!
బైక్ కీ ఇచ్చాను. ఒక గంట తరువాత వచ్చాడు. రాగానే కీ ఇచ్చి ధన్యవాదాలు చెప్పి, బండి ఇచ్చినందుకు, గట్టిగా కౌగలించుకుని వెళ్ళాడుi!
వాళ్ళావిడ గుమ్మం లోనే ఎదురొచ్చి,
"ఏమయ్యింది రిపోర్ట్?" అని ఆదుర్దాగా అడిగింది.
''ష్! అసలే ఎండలో వచ్చాను.
కాసిని మంచి నీళ్లు ఇచ్చి అడగొచ్చుగా!'' అంటూ కుర్చీ లో కూలబడుతూ,
''పాజిటివ్ వచ్చింది!" అన్నాడు.
ఆ మాట నా చెవిన పడింది??
దెబ్బకి గుండెల్లో రాయి పడింది!
గబా గబా , బాత్రూంలోకెళ్ళి, డెట్టాల్ సబ్బుతో స్నానం రెండు సార్లు చేసాను. బండి మొత్తం లైజాల్ తో కడిగాను. బైక్ కీని శానిటైజర్ తో ముంచేసాను!
అయినా , ఇంట్లోవాళ్ళు సణుగుతూనే వున్నారు.
నన్ను అనుమానంగా చూస్తున్నారు.
''ఎవరికి పడితే వాళ్లకి బైక్ ఇచ్చెయ్యడమేనా??''అని శ్రీమతి,
''ఇస్తే ఇచ్చారు, ఆయనికి షేక్ హాండ్ ఎందుకిచ్చారు?" అని కొడుకు,
''మీకు అతి వేషాలు, మొహమాటాలు ఎక్కువయ్యాయి" అని మా అమ్మాయి సణుగుతూనే వున్నారు !!!
నాకు కోపం, చికాకు అన్నీ హై లెవెల్ లో వచ్చేసాయి. వెంటనే పక్కింటికెళ్లి, ఆయన్ని దులిపేసాను.
''కొంచెం మీరు మ్యానెర్స్ నేర్చుకోండి సర్!
మీ రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని తెలిసినా ,
నాకు షాక్ హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం
ఇవి శాడిస్ట్ లక్షణాలు. మీ లాంటి వారికి,
హెల్ప్ చెయ్యడం నాదీ బుద్ధి తక్కువ!''
అని గట్టిగా ఆరిచేసి వచ్చేస్తుంటే,
వాళ్ళావిడ , లోపలి నుండి వచ్చి ..
నా చేతులు పట్టు కుని,
"అయ్యో అంకుల్! అలా తప్పుగా అనుకోవద్దు మమ్మల్ని!" అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది.
''అవును అంకుల్! ఆ రిజల్ట్ మా యావిడది!" అన్నాడు వాళ్ళ ఆయన.
ఆయన మరలా షాక్ !
'ఓయ్ బాబోయ్! నేను మళ్ళీ స్నానం చెయ్యాలారా బాబూ! ఇప్పుడు ఈవిడ కూడా నా చేతులు పట్టుకుందిగా! నా ఖర్మ...'
అనుకుంటూ నేను కళ్ళ నీళ్లు పెట్టుకోవడం చూసి,
"అవును అంకుల్! ఆ టెస్ట్ రిజల్ట్ మా యావిడది! పాజిటివ్ వచ్చిన మాట నిజమే! కానీ...కానీ..
అది మా ఆవిడ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అంకుల్!"
అన్నాడు ఆ పక్కింటి పెద్ద మనిషి!

(దేనికైనా కంగారు పడకండి! జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి! ప్రతీ రిపోర్ట్ కోవిడే కావాలని లేదు)


Post a Comment

0Comments

Post a Comment (0)