మంచి మనసు!

Telugu Lo Computer
0


లాక్ డౌన్ తర్వాత హాస్పిటల్ లో చూయించుకోడానికి వెళ్లాను. ఆ డాక్టర్ చాలా ఫేమస్ , ఆయనకు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. పేరు మోసిన #పొలిటీషియన్స్, సినిమాయాక్టర్లు అందరూ ఈ హాస్పిటల్ లోనే చూపించుకుంటారు.

నేను వెళ్లి చూపించుకున్నాను బిల్ 1000 అయ్యింది. అందులో డాక్టర్ ఫీజు 700 , అడ్మిన్ ఛార్జ్ 300 అని ఉంది. నాకర్థం కాలేదు…ఈ ఆడ్మిన్ ఛార్జ్ ఏంటో..!

క్యాషియర్ ను అడిగాను ఇదేంటని…దానికి ఆయన లాక్ డౌన్ సార్., మేము అందరి బిల్ మీద దీన్ని యాడ్ చేస్తున్నాం అని చెప్పాడు. చేసేదేం లేక బిల్ పే చేసి…ఇంటికి రిటర్న్ బయలుదేరాను .

ఎండ బాగా ఉండడంతో … కొబ్బరి #బోండాలాయన దగ్గర ఆపి మూడు కొబ్బరి కాయలు కొట్టించుకొని తాగాను..ఒక్కొక్కటి 40 అంటే మొత్తం 120 కానీ అతను 100 యే తీసుకున్నాడు.

నేను ఇంకో 20 తీసుకో అని అడిగాను. దానికి అతను ఈ కష్టకాలంలో డబ్బులు సంపాధించడం చాలా కష్టం సార్.. మీతో ఉండనివ్వండి. మూడు తీసుకున్నందుకు ఆఫర్ అనుకోండి అన్నాడు.

ఆపత్కాలంలో దోచుకోవాలని చూస్తున్న ఆ కార్పోరేట్ దవాఖానాలు ఎక్కడా….? మన గురించి కూడా ఆలోచించే ఈ చిన్న వ్యాపారులెక్కడ.!

Post a Comment

0Comments

Post a Comment (0)