టీకా వృథాను ఆపండి !

Telugu Lo Computer
0


అనేక రాష్ట్రాల్లో టీకా అందుబాటులో లేక టీకా ఇవ్వడం ఆపివేస్తే, కొన్ని రాష్ట్రాల్లో టీకా వృథా విపరీతంగా ఉంటుంది. వ్యాక్సిన్  వృథాను ఒక శాతం కంటే తక్కువగా ఉంచాలని కేంద్రం కోరుతుంటే, జార్ఖండ్, ఛతీస్ ఘడ్ తదితర రాష్ట్రాల్లో మూడు వంతుల డోస్ నిరుపయోగ మవుతున్నాయని కేంద్రం పేర్కొంది. అత్యధికంగా జార్ఖండ్ లో 37.3%,  ఛతీస్ ఘడ్ లో 32.2%, తమిళనాడు లో 15.5%, జమ్మూ కాశ్మీర్ లో 10.8%, మధ్యప్రదేశ్ లో 10.7% టీకాలు వృథా  అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ  ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్త సగటుతో (6.3%)పోలిస్తే ఇది ఎక్కువని రాష్ట్రాలు దీనిపై దృష్టి పెట్టి వృథాను ఆపాలని కోరింది. 


Post a Comment

0Comments

Post a Comment (0)